ఓటింగ్ శాతంపై ఎన్నికల కమిషనర్ కీలక వ్యాఖ్యలు.. తగ్గడానికి కారణమిదేనన్న పార్థసారథి

|

Dec 01, 2020 | 2:09 PM

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మధ్యాహ్నానికి పట్టుమని పాతిక శాతం కూడా దాటకపోవడానికి కారణం...

ఓటింగ్ శాతంపై ఎన్నికల కమిషనర్ కీలక వ్యాఖ్యలు.. తగ్గడానికి కారణమిదేనన్న పార్థసారథి
Follow us on

Reason behind lesser voting percentage: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మధ్యాహ్నానికి పట్టుమని పాతిక శాతం కూడా దాటకపోవడానికి కారణం వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి.

‘‘ కోవిడ్ వల్ల కొంత ఓటింగ్ తగ్గింది.. మధ్యాహ్నం తరువాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.. గతంలో కోవిడ్ లేదు కాబట్టి మధ్యాహ్నం 12 లోపు ఓటు హక్కు వినియోగించుకొనే వాళ్ళు ఇప్పుడు ఒకవైపు కోవిడ్, మరో వైపు చలి తోటి పోలింగ్ తగ్గింది.. శాంతి భద్రతలపై వాస్తవానికంటే రూమర్స్ ఎక్కువ ఉన్నాయి.. పోలీసులు అందరూ అలర్ట్‌గా ఉన్నారు, చిన్న చిన్న గొడవలు మినహా పెద్దగా ఏమి జరగలేదు..’’ అని పార్థసారథి అసలు కారణాన్ని ఆయన మాటల్లో వెల్లడించారు.

ఇదిలా వుంటే.. గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు ఓటర్లలో ఓటుహక్కు వినియోగంపై అనాసక్తి కనిపించడంతో నివ్వెర పోతున్నారు. తాజా సమాచారం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 18 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా గుడిమల్కాపూర్ వార్డులో 49.19 శాతం ఓటింగ్ నమోదు కాగా.. విద్యాధికులు అధికంగా వుంటే అమీర్‌పేటలో ఒక్క శాతం కూడా నమోదు కాలేదు. అమీర్‌పేటలో ఓటింగ్ వాతం 0.79 కాగా.. తలాబ్ చంచలంలో అత్యల్పంగా 0.74 శాతం ఓటింగ్ నమోదైంది.

ALSO READ: చెన్నైలో స్ట్రీట్ ఫైట్..లాఠీ ఛార్జీ.. పీఎంకే ఆందోళన.. రైళ్ళను నిలిపేసిన అధికారులు

ALSO READ: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల హఠాన్మరణం..గ్రేటర్ పోలింగ్ రోజున అధికార పార్టీలో విషాదం..