RBI On Money Lending Apps: ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..

|

Dec 23, 2020 | 5:09 PM

Unauthorised Lending Apps: ఆన్‌లైన్ లోన్ యాప్‌ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా సూచించింది.

RBI On Money Lending Apps: ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..
Follow us on

Unauthorised Lending Apps: ఆన్‌లైన్ లోన్ యాప్‌ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా సూచించింది. దేశంలోని పలు చోట్ల నుంచి ఈ యాప్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ప్రజలెవ్వరూ కూడా వాటి ఉచ్చులో పడొద్దని.. ఎవరితోనూ తమ వ్యక్తిగత సమాచారం, ముఖ్యమైన డాక్యూమెంట్స్‌ను షేర్ చేయొద్దని తెలిపింది. ఆర్‌బీఐ ప్రమాణాలకు లోబడి ఉన్న బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలు దగ్గర నుంచే రుణాలు తీసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం కీలక ప్రకటనను విడుదల చేసింది.

అతి తక్కువ సమయంలో.. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా లోన్స్ ఇస్తుండటం వల్ల వ్యక్తులు, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఈ యాప్‌ల పట్ల ఆకర్షితులు అవుతున్నారని ఆర్బీఐ తెలిపింది. లోన్ ఇవ్వడం ఒక ఎత్తయితే.. దాన్ని తిరిగి వసూలు చేసే విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారని.. అమోదభాగ్యం కాని పద్దతుల్లో రుణ గ్రహీతల మొబైల్ ఫోన్ల నుంచి డేటాను యాక్సెస్ చేసి ఒప్పందాలను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. కాగా, యాప్‌ల మోసాలపై sachet.rbi.org.in అనే వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాల్ స్పష్టం చేశారు.

Also Read:

‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!

ఆన్‌లైన్‌ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!