అసెంబ్లీ అంటే రచ్చ రచ్చేనా..? : ఆర్జీవీ

రాజకీయాల అంశమైనా, సమాజం గురించైనా, కీలకమైన టాపిక్‌పై స్పందించడంలో డైనమిక్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో హాట్‌‌హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ అంశంపై స్పందించాడు వర్మ. ‘అసెంబ్లీ అంటే అరవడం, విమర్శలు చేయడం లేకపోతే ఆరోపించడం ఇదేనా..? వీటితోనే మొత్తం కాలం అంతా వృథా చేస్తున్నారు. మీ సొంత ప్రతీకారాలు, పౌరుషాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల గురించి స్పందించాలని […]

అసెంబ్లీ అంటే రచ్చ రచ్చేనా..? : ఆర్జీవీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2019 | 5:21 PM

రాజకీయాల అంశమైనా, సమాజం గురించైనా, కీలకమైన టాపిక్‌పై స్పందించడంలో డైనమిక్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో హాట్‌‌హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ అంశంపై స్పందించాడు వర్మ.

‘అసెంబ్లీ అంటే అరవడం, విమర్శలు చేయడం లేకపోతే ఆరోపించడం ఇదేనా..? వీటితోనే మొత్తం కాలం అంతా వృథా చేస్తున్నారు. మీ సొంత ప్రతీకారాలు, పౌరుషాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల గురించి స్పందించాలని కోరుకుంటున్నా’ అని హాట్‌గా ట్వీట్ చేశారు డైరెక్టర్ వర్మ.