ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలకు పితృవియోగం కలిగింది. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. గత కొద్ది రోజులుగా దేవదాస్ కనకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈయన 1945, జులై 30న యానంలో జన్మించారు. దేవదాస్ కనకాలకు ఇద్దరు సంతానం.. కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ.
హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ నడిపిన దేవదాస్ కనకాల. కాగా.. దేవదాస్ కనకాల దగ్గర పలువురు టాప్ హీరోలు.. రజినీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌లు శిక్షణ పొందారు. ఆ తరువాత బుల్లితెరలోని ‘అమృతం’ అనే సీరియల్‌లో నటించారు. చలిచీమలు, నాగవల్లి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. దేవదాస్ కనకాల నటించిన సినిమాలు:
1. ఓ సీత కథ
2. మాంగళ్యానికి మరో ముడి
3. సిరిసిరి మువ్వ,
4. మంచు పల్లకి
5. గోరింటాకు
6. భలే దంపతులు
7. గ్యాంగ్ లీడర్,
8. చెట్టుకింద ప్లీడర్
9. అమ్మో ఒకటో తారీఖు
10. మనసంతా నువ్వే
11. శ్రీరామ్
12. పెదబాబు
13. మల్లీశ్వరి,
14. కింగ్
15. అసాధ్యుడు
16. భరత్ అనే సినిమాలో చివరిగా నటించారు.
కాగా.. దేవదాస్ కనకాల మృతికి పలువురు నేతలు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.