Rain Alert: రెయిన్ అలెర్ట్.. ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు: వాతావరణశాఖ

|

May 07, 2021 | 6:45 PM

Andhra Pradesh Rain Alert: పలు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు వర్షాలు

Rain Alert: రెయిన్ అలెర్ట్.. ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు: వాతావరణశాఖ
Andhra Pradesh Rain Alert
Follow us on

Andhra Pradesh Rain Alert: పలు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎండలతో అల్లాడుతున్న ప్రజకలు ఈ వర్షాలతో కొంత ఉపశమనం కలిగిస్తోంది. కాగా.. కొన్ని రోజుల ఉపరితల ఆవర్తనంతో నుంచి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల పంటలకు, మామిడితోటలకు నష్టం వాటిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనను విడుదల చేసింది. ఈ రోజు, శనివారం, ఆదివారం వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

దక్షిణ కోస్తా ఆంధ్రాలో శుక్రవారం, శనివారం, ఆదివారం ఉరుములు , మెరుపులతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలో.. కూడా శుక్రవారం, శనివారం, ఆదివారం ఉరుములు , మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాంకుండా పలుచోట్ల పిడుగులు పడే సూచనలు కూడా ఉన్నాయని తెలిపింది.

Also Read:

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కర్ఫ్యూ దృష్ట్యా పనివేళల్లో మార్పు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్

Breaking News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..