అమెరికాలోని భారతీయ విద్యార్థులకు, హెచ్ 1 బి వీసా హోల్డర్లకు మళ్లీ మంచిరోజులు, ప్రెసిడెంట్ బైడెన్ నేతృత్వంలో కొత్త అడుగులు

అమెరికాలోని భారతీయ విద్యార్థులకు, హెచ్ 1 బి వీసా హోల్డర్లకు ఉపశమనం కలిగించే వార్త. అమెరికా ఇమ్మిగ్రేషన్ లా విషయంలో రెండు కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి..

  • Venkata Narayana
  • Publish Date - 4:38 am, Wed, 3 February 21
అమెరికాలోని భారతీయ విద్యార్థులకు, హెచ్ 1 బి వీసా హోల్డర్లకు మళ్లీ మంచిరోజులు, ప్రెసిడెంట్ బైడెన్ నేతృత్వంలో కొత్త అడుగులు

అమెరికాలోని భారతీయ విద్యార్థులకు, హెచ్ 1 బి వీసా హోల్డర్లకు ఉపశమనం కలిగించే వార్త. అమెరికా ఇమ్మిగ్రేషన్ లా విషయంలో రెండు కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టంలో OPT, STEM OPT పొడిగింపు కోసం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ నిర్ణయం వెలువడింది, అమెరికా కార్మిక శాఖ మే 14, 2021 వరకూ వీటికి సంబంధించి నిబంధనల అమలును వాయిదావేసింది. OPT(ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) కార్యక్రమం డిగ్రీలు పూర్తిచేసే విద్యార్థులకు ఒక సంవత్సరం పని చేసుకునే అధికారాన్ని అందిస్తుంది. ప్రతి వారం 20 గంటలకు లోపు విద్యార్థులు తమ సొంత రంగంలో పనిచేయాలని డబ్బు చెల్లించినా లేకున్నా పని చేసుకోవచ్చని సదరు నిబంధన సూచిస్తోంది.

ఇక, STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) గ్రాడ్యుయేట్లు తమ OPT ని మరో రెండేళ్ల వరకు పొడిగించవచ్చు, అమెరికాలో పనిచేయడానికి వీరికి మొత్తం మూడు సంవత్సరాలు వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు, విద్యార్థులు H-1B లాటరీ కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. మొత్తం మీద, హెచ్ 1 బి వీసాలు, ఇమ్మిగ్రేషన్ విధానంలో ఒబామా తెచ్చిన సరళీకృత విధానాల్ని ట్రంప్ అడ్డుకున్నప్పటికీ బైడెన్ అధికారంలోకి వచ్చిన పిదప మళ్లీ అమెరికాలో భారతీయులకు మంచి రోజులు వస్తుండటం విశేషం.

అంతేకాదు, అమెరికా నూతన అధ్యక్షునిగా జోబైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమెరికాలో నివసిస్తోన్న లక్షలాది భారతీయుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయే సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. హెచ్ 1 బీ వీసాలతో బాటు హై స్కిల్డ్ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చునని, అలాగే ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఒక్కొక్కటిగా రద్దు చేయవచ్చునని భావిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ పాలసీలను సైతం జో.. సవరణలు తీసుకొస్తున్నారు.

హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ లేదా విదేశీ భర్తలు, లేదా భార్యల వర్క్ పర్మిట్లను ఆయన ప్రభుత్వం పునరుధ్ధరించి, గతంలో ఉన్న నిబంధనలను మార్చే సూచనలు కూడా ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా యూ ఎస్ లో జాబ్స్ చేస్తున్న లక్షలాది భారతీయ కుటుంబాలకు ఇది వరమే అవుతుంది. గ్రీన్ కార్డుల విషయంలోనూ జో ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ ని అమలు చేయవచ్చు. ఇమ్మిగ్రంట్లకు అనువుగా నగరాలు, కౌంటీలు కొత్త వీసా కేటగిరీని సృష్టించాలని కూడా జో బైడెన్ ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు.