India Toy Fair 2021: భారతీయ జీవావరణానికి తగినట్లు బొమ్మలను తయారుచేయాలి: ప్రధాని నరేంద్ర మోదీ

|

Feb 27, 2021 | 3:08 PM

PM Narendra Modi: భార‌తీయుల సైకాల‌జీ, జీవావ‌ర‌ణానికి త‌గిన‌ట్లు బొమ్మలను త‌యారు చేయాల‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మల ఉత్పత్తిదారులను పిలుపునిచ్చారు. సహజసిద్ధమైన..

India Toy Fair 2021: భారతీయ జీవావరణానికి తగినట్లు బొమ్మలను తయారుచేయాలి: ప్రధాని నరేంద్ర మోదీ
PM Narendra Modi
Follow us on

PM Narendra Modi: భార‌తీయుల సైకాల‌జీ, జీవావ‌ర‌ణానికి త‌గిన‌ట్లు బొమ్మలను త‌యారు చేయాల‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మల ఉత్పత్తిదారులను పిలుపునిచ్చారు. సహజసిద్ధమైన బొమ్మల తయారీకి తమ ప్రభుత్వం చేయూతనందిస్తుందని ఆయన వెల్లడించారు. శనివారం ప్రధాని మోదీ ఇండియా టాయ్ ఫెయిర్ 2021ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. వ‌ర్చువ‌ల్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ.. భార‌త్‌లో బొమ్మలన్నీ దాదాపు స‌హ‌జ‌సిద్ధంగా, ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌మైన ప‌దార్ధాల‌తో త‌యారు అవుతాయ‌ని పేర్కొన్నారు. భార‌తీయ బొమ్మలకు వాడే రంగుల‌న్నీ స‌హ‌జ‌మైన‌వ‌ని, సుర‌క్షిత‌మైన‌వ‌ని మోదీ వెల్లడించారు. విదేశాల బొమ్మల్లో రసాయనాలే ఉంటాయన్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తుచేశారు.

మన బొమ్మలు భారత జీవనశైలిలో భాగమవ్వాలని.. దీంతోపాటు రీసైక్లింగ్‌ను వ్యవస్థను ప్రభావితం చేయాలని మోదీ పేర్కొన్నారు. భార‌తీయుల సైకాల‌జీ, జీవావ‌ర‌ణానికి త‌గ్గిన‌ట్లు బొమ్మలను త‌యారుచేయాల‌ని ఉత్పత్తి దారులను కోరారు. బొమ్మల త‌యారీలో సాధ్యమైనంతమేరకు ప్లాస్టిక్‌ను త‌గ్గించాల‌ని, రీసైక్లింగ్‌కు అనువైన ప‌దార్ధాల‌ను వాడాల‌ని ఆయ‌న సూచించారు. ప్రపంచవ్యాప్తంగా భార‌తీయ బొమ్మలకు డిమాండ్ ఉంద‌ని, మేడిన్ ఇండియాకు గుర్తింపు ఉన్నట్లు.. హ్యాండ్ మేడ్ ఇన్ ఇండియా బొమ్మలకు కూడా మార్కెట్ ఉంద‌ని మోదీ అన్నారు. జాతీయ బొమ్మల కార్యాచ‌ర‌ణ ప్రణాళిక రూపొందించామ‌ని, 15 మంత్రిత్వశాఖలతో ఆ కార్యాచ‌ర‌ణ ప్రణాళికను అనుసంధానం చేశామ‌ని ప్రధాని మోదీ తెలిపారు.

ఈ వర్చువల్ సమావేశంలో మోడీ దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది బొమ్మల తయారీదారులతో సంభాషించారు. 200 సంవత్సరాలుగా బొమ్మల ప్రసిద్ధి అయిన కర్ణాటక బొమ్మల క్లస్టర్ చెన్నపట్నానికి చెందిన వారితో కూడా మోదీ మాట్లాడారు. భారత బొమ్మల పరిశ్రమ అభివృద్ధి చెందడానికి వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఆకాంక్షించారు. అయితే ఈ ఇండియా టాయ్ ఫెయిర్ మార్చి 4వరకు కొనసాగనుంది.

Also Read:

‘బీజేపీ సే సబ్ పరేషాన్’, కాషాయ పార్టీ చివరకు దేశానికి కషాయమే మిగిలుస్తుందా ? సామాన్యుడి సణుగుడు

Stock market: భారీగా పతనమైన రూపాయి విలువ.. 18 నెలల్లో ఇదే అత్యధికం.. కుదేలైన షేర్ మార్కెట్లు