ఈ జత ఎడ్ల ధర ఏకంగా రూ.17లక్షలు !

|

Oct 11, 2020 | 6:40 PM

కర్ణాటకలోని బాగల్​కోట్​లో జత ఎడ్లు అదిరిపోయే రేటుకు అమ్ముడయ్యాాయి. జత ఎడ్లను ఏకంగా రూ. 17 లక్షలకు అమ్మాడు ఓ వ్యవసాయదారుడు.

ఈ జత ఎడ్ల ధర ఏకంగా రూ.17లక్షలు !
Follow us on

కర్ణాటకలోని బాగల్​కోట్​లో జత ఎడ్లు అదిరిపోయే రేటుకు అమ్ముడయ్యాయి. జత ఎడ్లను ఏకంగా రూ. 17 లక్షలకు అమ్మాడు ఓ వ్యవసాయదారుడు. మహాలింగపుర్​లోని నందగావ్​లో సంగప్ప అనే రైతు, అక్కిమారడికి చెందిన మల్లప్ప దగ్గరి నుంచి 2018లో ఆ ఎడ్లను కొన్నాడు. అప్పుడు వాటి విలువ 8 లక్షల రూపాయలు. ఆ తర్వాత వాటికి రామ్​-లక్ష్మణ్​ అనే పేరు పెట్టి.. ఎంతో అపురూపంగా చూసుకున్నాడు సంగప్ప.

48 పోటీల్లో పాల్గొన్న ఈ ఎడ్లు ఇప్పటివరకు సుమారు రూ. 9 లక్షల రూపాయల ప్రైజులు గెలిచాయి. దాదాపు అన్ని రేసుల్లోనూ ఇవి ఫస్ట్, సెకండ్  స్థానాల్లో నిలిచేవి. అనివార్య కారణాల వల్ల..ఇప్పుడు మళ్లీ మల్లప్పకే వాటిని రూ.17 లక్షలకు విక్రయించాడు సంగప్ప. ( Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే ! )