Precious Painting Lost : రూ.2.5 కోట్లు విలువైన పెయింటింగ్ విమానాశ్రయంలో పోయింది.. చెత్త కుప్పలో దొరికింది!

|

Dec 27, 2020 | 8:22 PM

అతను ఓ ఫేమస్ బిజినెస్‌మేన్. ఆయనికి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. చాలా డబ్బులు పెట్టి తన మనసుకు నచ్చిన పెయింటింగ్స్ కొంటూ ఉంటారు.

Precious Painting Lost : రూ.2.5 కోట్లు విలువైన పెయింటింగ్ విమానాశ్రయంలో పోయింది.. చెత్త కుప్పలో దొరికింది!
Follow us on

అతను ఓ ఫేమస్ బిజినెస్‌మేన్. ఆయనికి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. చాలా డబ్బులు పెట్టి తన మనసుకు నచ్చిన పెయింటింగ్స్ కొంటూ ఉంటారు. ఆయన ఇటీవల సుమారు రూ.2.5 కోట్లు విలువైన పెయింటింగ్‌ను ఎయిర్‌పోర్టులో మర్చిపోయాడు. ఆ తర్వాత అది దగ్గర్లోని డస్ట్ బిన్‌లో దొరికింది. ఈ ఘటన జర్మనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… ఫ్రెంచ్‌ సర్రీయలిస్టు టాంగే గీసిన ఈ పెయింటింగ్‌ను డస్సెల్‌డార్ఫ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్లే ప్రయాణంలో నవంబర్‌ 27న సదరు వ్యాపారవేత్త మర్చిపోయి చేజార్చుకున్నాడు.

ఇజ్రాయిల్‌లో విమానం దిగిన వెంటనే విషయం గ్రహించి డస్సెల్‌డార్ఫ్‌ పోలీసులకు సమాచారం అందించి..సాయం చేయాల్సిందిగా కోరాడు. అనంతరం ఈమెయిల్స్‌లో చిత్రానికి‌ సంబంధించిన వివరాలను ఆయన పంపించినా..విమానాశ్రయంలో దాని ఆచూకి  కనిపించలేదని పోలీసులు తెలిపారు. దీంతో బిజినెస్‌మేన్ మేనల్లుడు బెల్జియం నుంచి వచ్చి స్థానిక పోలీసులను కలిశాడు. పూర్తి సమాచారం అందుకున్న అనంతరం పోలీసులు పలుచోట్ల విచారించగా ఒక ఇన్‌స్పెక్టర్‌కు సదరు పెయింటింగ్‌ ఒక పేపర్‌ రీసైక్లింగ్‌ డస్ట్ బిన్‌లో దొరికింది. ఈ రీసైక్లింగ్‌ తొట్టిని విమానశ్రయ క్లీనింగ్‌ కంపెనీ వినియోగిస్తోంది. అక్కడనుంచి తీసుకువచ్చిన పెయింటింగ్‌ను సదరు వ్యాపారవేత్తకు భద్రంగా అందజేసామని పోలీసులు వెల్లడించారు.

Also Read :

Rajinikanth Health Update : ఆల్ క్లియర్.. ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..ఆనందంలో అభిమానులు

 మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం