Viral: 100 పొట్టేళ్లతో అక్కడ ప్రతి ఏటా నాన్-వెజ్ జాతర.. ఆడాళ్లకు నో ఎంట్రీ

|

Jan 02, 2022 | 3:58 PM

అక్కడ నాన్-వెజ్ జాతర జరుగుతుంది. 100 పొట్టేళ్ల తలలు తెగుతాయి. కానీ ఆడవాళ్లకు మాత్రం ఈ ఫెస్టివల్‌కు ఎంట్రీ లేదు.

Viral: 100 పొట్టేళ్లతో అక్కడ ప్రతి ఏటా నాన్-వెజ్ జాతర.. ఆడాళ్లకు నో ఎంట్రీ
Non Veg Festival
Follow us on

మధురై జిల్లా తిరుమంగళంలో ఉన్న కరుప్పారై ముత్తయ్య ఆలయంలో నిర్వహించే, ఓ జాతర ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. ప్రతి ఏడాది ఎంతో గ్రాండ్‌ జరిగే ఈ జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ జాతరను కిడా విరుందు జాతర అని పిలుస్తుంటారు. కిడా విరుందు అంటే మాంసాహార జాతర అని అర్థం. మధురై జిల్లాలో ఉన్న వేలాది మంది పురుషులు ఈ జాతరకు వస్తారు. తమ తాహతును బట్టి మేకనో , కోళ్లనో దానంగా ఇస్తుంటారు.

ఇలా దానంగా వచ్చిన మేకలు, కోళ్లను ఆలయ సిబ్బంది జాగ్రత్తగా పెంచుతారు. ఎందుకు అంటే కిడా విరుందు కోసం! ప్రతీ ఏడాది జనవరి రెండో తేదీన సుమారు వంద పొట్టేళ్లతో మంచి రుచికరమైన వంటలను వండుతారు.. కిడా విరుందు ఏర్పాటు చేసి జాతరకి వచ్చిన వారందరికీ విందు భోజనం పెడతారు. జాతరకి వచ్చిన మాంసం ప్రియులు ఈ వంటలను ఎగబడి ఆరగిస్తారు. ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే ఈ జాతర పూర్తి అయిన తర్వాత.. పురుషులు తిన్న విస్తరాకులు ఎండిపోయే వరకు ఆ పరిసర ప్రాంతాలకు మహిళలు వెళ్లకూడదట.. ఈ నిబంధనను ఆలయ సిబ్బంది గట్టిగానే పాటిస్తారు.

Also Read:  Manchu Family: చిరు వ్యాఖ్యల అనంతరం మంచు ఫ్యామిలీ నుంచి సెన్సేషనల్ న్యూస్!

Telangana: కిలో మటన్‌ కొను.. అదిరిపోయే గిఫ్ట్‌ పట్టు.. వ్యాపారి క్రేజీ ఆఫర్..