ఏపీ ప్రభుత్వానికి షాక్.. స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదన్న కేంద్రం!

No Special Status To AP: జగన్ సర్కార్‌కు షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. హోదా విషయంపై లోక్‌సభలో మరోమారు టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కుదరదని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యయమని.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని 14వ ఆర్ధిక సంఘం కూడా […]

ఏపీ ప్రభుత్వానికి షాక్.. స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదన్న కేంద్రం!
Follow us

| Edited By:

Updated on: Feb 05, 2020 | 5:38 AM

No Special Status To AP: జగన్ సర్కార్‌కు షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. హోదా విషయంపై లోక్‌సభలో మరోమారు టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కుదరదని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యయమని.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని 14వ ఆర్ధిక సంఘం కూడా చెప్పిందని ఆయన అన్నారు. అంతేకాక హోదాను మించిన ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తామని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే గతంలో కూడా కేంద్రం పార్లమెంట్ సాక్షిగా స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని చాలాసార్లు స్పష్టం చేసింది.

హోదాకు మించిన ప్యాకేజీని ఇస్తామని.. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కూడా అందుకు ఒప్పుకుందని చెప్పింది. బీహార్, రాజస్థాన్, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ తెలంగాణ, ఏపీల నుంచి హోదా రిక్వెస్టులు వచ్చాయని.. ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చేది లేదని అప్పట్లో నిర్మల సీతారామన్ ప్రకటించిన సంగతి విదితమే. ఇక తాజా బడ్జెట్‌లోనూ ఏపీకి నిరాశే మిగిలింది. వెనుకబడిన ప్రాంతాలకూ ఎటువంటి సాయం అందలేదు.