No More Diesel Vehicles:హైదరాబాద్‌లో డీజిల్ వాహనాలపై నిషేధం.. కేసీఆర్ కీలక నిర్ణయం..!

|

Feb 14, 2020 | 3:18 PM

వాహనాల సంఖ్యను పెరగకుండా ఉండేందుకు రెండు శాతం అదనపు లైఫ్ ట్యాక్స్‌ను పెంచాలని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో 12 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధించడానికి వీలుగా ఉన్న అంశాలపై ఫోకస్ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది...

No More Diesel Vehicles:హైదరాబాద్‌లో డీజిల్ వాహనాలపై నిషేధం.. కేసీఆర్ కీలక నిర్ణయం..!
Follow us on

No More Diesel Vehicles: మెట్రో నగరాల్లో పెరుగుతున్న వాహనాల రీత్యా వాయు కాలుష్యం తారాస్థాయికి చేరుకుంటోంది. దీంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటే మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే రవాణాశాఖకు పలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచనలు ఇచ్చినట్లు  సమాచారం.

Also Read: Chennai Hotel Serves Meals For Rs 30

తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో వాహనాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన కేసీఆర్… వాహనాల పొగతో నగరం వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి కాకముందే మొక్కలు పెంచడంతో పాటుగా డీజిల్ వాహనాలను సైతం నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 15 లక్షల డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ఆ వాహనాల సంఖ్యను పెరగకుండా ఉంచేందుకు వాటి విక్రయాలు తగ్గేందుకు ఫోకస్ చేయాలని చెప్పారు. ఇందులో భాగంగానే డీజిల్ వాహనాలపై మరింత అధిక పన్నును వసూలు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో 12 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధించడానికి వీలుగా ఉన్న అంశాలపై విశ్లేషణ జరపాలని అధికారులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

Read More: Good News To Hyderabad People By KTR

అటు ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోళ్లను కూడా పెంచేందుకు విధి విధానాలను సిద్ధం చేయాలన్నారు. ఈ క్రమంలోనే బ్యాటరీ వాహనాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలని యోచిస్తున్నారు. దీని బట్టి చూస్తే భాగ్యనగరంలో డీజిల్ వాహనాలు ఉపయోగిస్తున్న వారికి తొందర్లో తిప్పలు పడేలా ఉన్నారు.