తిరుమల ఘాట్ రోడ్డులో ‘ఆ’ వాహనాలకు నో ఎంట్రీ

|

Nov 05, 2020 | 6:14 PM

తిరుమలలో పొల్యూషన్ లేకుండా చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది పోలీసు శాఖ. అదే సమయంలో ఘాట్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టింది. అదే సమయంలో తిరుమలో సొంత వాహనాలపై వచ్చే భక్తులకు కొన్ని ఆంక్షలను విధించింది.

తిరుమల ఘాట్ రోడ్డులో ‘ఆ’ వాహనాలకు నో ఎంట్రీ
Follow us on

No entry for old vehicles on Tirumala Ghat road: పాతవి, ఫిట్‌నెస్ లేని వాహనాలను ఇకపై తిరుమల ఘాట్ రోడ్లపైకి అనుమతించేది లేదని వెల్లడించారు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య. కాలం చెల్లిన వాహనాలపై తిరుమలతోపాటు.. ఘాట్ రోడ్లపై నిషేధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మునిరామయ్య ఈ నిషేధాన్ని ప్రకటించారు.

‘‘ 2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదు.. ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించం.. రెండో ఘాట్ రోడ్డులోని శ్రీవారి సహజ శిలా స్వరూపం కనిపించే ప్రదేశంలో వాహనాలు నిలిపేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఆ ప్రదేశంలో భక్తులు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నాం.. తిరుమల క్షేత్రం నో హారన్ జోన్ కావడంతో భక్తులు తమ వాహనాల హారన్ మోగించకూడదు.. హారన్ మోగించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానా విధిస్తాం.. ’’ అని మునిరామయ్య తెలిపారు.

ALSO READ: భూసర్వేపై జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం

ALSO READ: బందరు పోర్టుపై కేబినెట్ కీలక నిర్ణయం

ALSO READ: టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు

ALSO READ: పాకిస్తాన్ మరో దుష్ట పన్నాగం.. ఇండియా తీవ్ర అభ్యంతరం

ALSO READ: వండర్ కలెక్టర్ టీచరైన వేళ!