దంతెవాడలో 9 మంది మావోయిస్టుల అరెస్ట్‌

|

Sep 13, 2020 | 10:12 PM

మావోయిస్టు ప్రభావిత ప్రాంతంమైన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో తొమ్మిది మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దంతెవాడలో 9 మంది మావోయిస్టుల అరెస్ట్‌
Follow us on

మావోయిస్టు ప్రభావిత ప్రాంతంమైన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో తొమ్మిది మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా రిజర్వ్‌ గార్డ్‌, జిల్లా పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో వీరు చిక్కినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ ఆదివారం వివరించారు. మలివాడ, మోఖ్‌పల్‌ గ్రామాల మధ్య శనివారం పెట్రోలింగ్‌ బలగాలను చూసి వీరు పారిపోడానికి ప్రయత్నించగా పట్టుకున్నట్లు తెలిపారు. వీరంతా మావోయిస్టు పార్టీలో దిగువ స్థాయి కేడర్‌ అని ఎస్పీ వెల్లడించారు.

వీరంతా  మావోయిస్టు పార్టీ అనుబంధ విభాగాలైన దండకారణ్యం ఆదివాసీ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌, జన్‌మిలిషియాకు చెందిన వారిగా గుర్తించామన్నారు. భద్రతా సిబ్బంది అడుగులను ఎప్పటికప్పుడు సీనియర్‌ కేడర్‌కు చేరవేయడం, మావోయిస్టులకు సంబంధించిన పోస్టర్లను అతికించడం వంటి పనులు వీరు నిర్వర్తిస్తారని తెెలిపారు.

Also Read :

దొంగతనానికి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు

పెళ్లి చేసుకున్న మరో హీరోయిన్