ఎలా వచ్చిందో తెలీదు, ఎలా మాయమైందో తెలీదు, ఎడారిలో అంతుచిక్కని లోహస్తంభం మిస్టరీ !

|

Nov 30, 2020 | 12:38 PM

అమెరికాలోని ఉటా ఎడారిలో కొద్ది రోజుల క్రితం కనిపించిన లోహ స్తంభం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని పరిశోధకులంతా ఆసక్తిగా గమనించారు.

ఎలా వచ్చిందో తెలీదు, ఎలా మాయమైందో తెలీదు, ఎడారిలో అంతుచిక్కని లోహస్తంభం మిస్టరీ !
Follow us on

అమెరికాలోని ఉటా ఎడారిలో కొద్ది రోజుల క్రితం కనిపించిన లోహ స్తంభం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని పరిశోధకులంతా ఆసక్తిగా గమనించారు. మోనోలిత్‌ అని పిలువబడే ఆ లోహపు స్తంభం తాజాగా అదృశ్యమైంది.  ఉటా రాష్ట్రానికి చెందిన ఉటా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సేఫ్టీ అండ్‌ డివిజన్‌ ఆఫ్‌ వైల్డ్‌లైఫ్‌ రీసోర్సెస్‌ అధికారులు ఎర్రని రాళ్లతో నిండిన ఉటా ఎడారిలో నవంబర్‌ 18న ఓ లోహ స్తంభాన్ని గుర్తించారు. 10 నుంచి 12 అడుగుల ఎత్తు, మూడు వైపుల స్టీల్‌తో తయారైన ఆ స్తంభాన్ని అక్కడ ఎవరు పెట్టారో వాళ్లకు అర్థంకాలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

అయితే సడెన్‌ గా ఆ స్తంభం కనిపించడంలేదని ఉటాకు చెందిన బ్యూరో ఆఫ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు తెలిపారు. తాము తొలగించినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు. ఈ నేపథ్యంలో పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ స్తంభాన్ని గ్రహాంతరవాసులే ప్రతిష్టించి, మళ్లీ తీసుకెళ్లారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read :

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !

Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు