పద్మ విభూష‌ణ్ పండిట్ జ‌స్ రాజ్ మృతి

| Edited By:

Aug 17, 2020 | 7:25 PM

ప‌ద్మ విభూష‌ణ్ పండిట్ జ‌స్‌రాజ్ అమెరికాలోని న్యూజెర్సీలో తుదిశ్వాస క‌న్నుమూశారు. 90 ఏళ్ల జ‌స్ రాజ్‌.. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘ‌రానాకు చెందిన ప్ర‌ఖ్యాత సంగీత గాయ‌కుడు. కాగా అమెరికాలోని న్యూజెర్సీలో ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్లు.

పద్మ విభూష‌ణ్ పండిట్ జ‌స్ రాజ్ మృతి
Follow us on

ప‌ద్మ విభూష‌ణ్ పండిట్ జ‌స్‌రాజ్ అమెరికాలోని న్యూజెర్సీలో తుదిశ్వాస క‌న్నుమూశారు. 90 ఏళ్ల జ‌స్ రాజ్‌.. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘ‌రానాకు చెందిన ప్ర‌ఖ్యాత సంగీత గాయ‌కుడు. కాగా అమెరికాలోని న్యూజెర్సీలో ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుమార్తె దుర్గా జ‌స్ రాజ్ వెల్ల‌డించారు.

1930లో హ‌రియాణాలోని హిసార్ జిల్లాలో జ‌న్మించిన జ‌స్‌రాజ్ గాయ‌కుడిగా, సంగీత గురువుగా, త‌బాలా వాద్య కారుడిగా విశేష ఖ్యాతి గ‌డించారు. జ‌స్ రాజ్ పాడిన శాస్త్రీయ‌, సెమీ క్లాసిక‌ల్ గీతాలు విశేష ప్ర‌జాధార‌ణ పొందాయి. ఆయ‌న ఆల్బ‌మ్‌లు, సినీ గీతాలు ప్ర‌పంచ వ్యాప్తంగా సంగ‌తీ అభిమానుల‌ను ఓల‌లాడించాయి. భార‌త్, అమెరికా, కెన‌డాలో ఆయ‌న‌కి అనే మంది అభిమానులు ఉన్నారు. ఇక జ‌స్‌రాజ్ మృతి ప‌ట్లు పలువురు ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Also Read: 

మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం