వంద‌ల సంఖ్య‌లో ఏనుగుల మరణం.. తెలియ‌ని కారణం

ఆఫ్రికా దేశం అయిన బోత్సువానాలో ఏనుగుల‌ అనుమానాస్పద మ‌ర‌ణాలు క‌ల‌క‌లం రేపాయి. దాదాపు 360పైగా ఏనుగులు అంతుచిక్క‌ని కార‌ణంతో త‌నువు చాలించాయి.

వంద‌ల సంఖ్య‌లో ఏనుగుల మరణం.. తెలియ‌ని కారణం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 03, 2020 | 12:45 PM

ఆఫ్రికా దేశం అయిన బోత్సువానాలో ఏనుగుల‌ అనుమానాస్పద మ‌ర‌ణాలు క‌ల‌క‌లం రేపాయి. దాదాపు 360పైగా ఏనుగులు అంతుచిక్క‌ని కార‌ణంతో త‌నువు చాలించాయి. కాగా ఏనుగులు సామూహిక మ‌ర‌ణాల‌కి కార‌ణాలు ఏంట‌న్న‌ది కనుక్కోవడానికి వన్యప్రాణి నిపుణులు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని బోత్సువానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ నేషనల్ పార్క్ సీరియ‌స్ గా తీసుకుంది. అధికారులు ఏనుగుల మృతదేహాలకు పరీక్షలు నిర్వహించారు. అయితే కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆ న‌మూనాల‌ను ప్రపంచంలోని పలు దేశాల్లోని అత్యుత్తమ ల్యాబుల‌కు త‌ర‌లించ‌డానికి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. అయితే లాక్ డౌన్ మిన‌హాయింపులు ఉన్న‌ కొన్ని దేశాల‌కు శాంపిల్స్ పంపించారు. రిపోర్ట్స్ రావడానికి మరో రెండు వారాల సమయం పడుతుంద‌ని స‌మాచారం.

ఆఫ్రికాలో మొత్తం ఏనుగులు అన్నింటిలో.. అధిక‌ భాగం బోత్సువానాలోనే ఉన్నాయి. ఏనుగుల దంతాల కూడా మిస్ అవ్వ‌లేదు కాబ‌ట్టి వాటిని వేట‌గాళ్లు చంపలేద‌ని ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు అధికారులు. విషప్రయోగం జరిగిందా అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?