మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు!

| Edited By:

Aug 06, 2020 | 3:36 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మోడల్ స్కూళ్ళలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు.

మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు!
Follow us on

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మోడల్ స్కూళ్ళలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఇప్పటికే ఒకసారి పొడిగించగా.. మరోసారి దరఖాస్తు గడువును పొడిగించారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా దరఖాస్తు చేసుకునేందుకు https://apms.apcfss.in/ క్లిక్ చేయండి. 2019-20 విద్య సంవత్సరంలో 5వ తరగతి చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ కాకుండా లాటరీ ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నారు.

Read More:

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!