విషాదం : కరోనాతో మాదాపూర్ ఎస్ఐ మృతి

|

Sep 18, 2020 | 1:48 PM

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాపై ముందుండి పోరాటం  చేస్తోన్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌పై వైరస్ తీవ్ర ప్రతాపం చూపుతోంది.

విషాదం : కరోనాతో మాదాపూర్ ఎస్ఐ మృతి
Follow us on

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాపై ముందుండి పోరాటం  చేస్తోన్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌పై వైరస్ తీవ్ర ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే వైరస్‌ కారణంగా పలువురు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మెడికల్ సిబ్బంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో చాలామంది అధికారులు, సిబ్బంది కోవిడ్ కారణంగా ప్రాణాలు విడిచారు. తాజాగా కరోనాతో మాదాపూర్‌ ఎస్‌ఐ అబ్బాస్‌ అలీ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలీకి ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. ఈ క్రమంలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.  తాజాగా పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంపై రాష్ట్ర పోలీస్‌ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

కాగా తెలంగాణలో కొత్తగా 2,043 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,67,046 కు చేరింది. 24 గంటల్లో 11 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,016కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,802 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,35,357కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 50,634  పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 23,79,950కు చేరింది.

Also Read :

విషాదం, నేరెడిమేట్‌లో మిస్సైన బాలిక మృతదేహం లభ్యం

వైఎస్ వివేకా హత్యకేసులో లేటెస్ట్ అప్డేట్

ఫారెన్ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ వచ్చిందంటూ మహిళకు టోకరా