Lpg Gas Price: కీలక నిర్ణయం దిశగా ఆయిల్ కంపెనీలు..ఇకపై ప్రతి వారం మారనున్న సిలిండర్ ధర !

|

Dec 22, 2020 | 12:39 PM

చమురు కంపెనీలు ఇకపై ప్రతి వారం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను సమీక్షించనున్నాయి. ప్రతి సమీక్షలో, సిలిండర్ (ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర) ధరను పరిస్థితులను బట్టి తగ్గించడం లేదా పెంచడం చేయనున్నాయి.

Lpg Gas Price:  కీలక నిర్ణయం దిశగా ఆయిల్ కంపెనీలు..ఇకపై ప్రతి వారం మారనున్న సిలిండర్ ధర !
Follow us on

Lpg Gas Price: చమురు కంపెనీలు ఇకపై ప్రతి వారం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను సమీక్షించనున్నాయి. ప్రతి సమీక్షలో, సిలిండర్ (ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర) ధరను పరిస్థితులను బట్టి తగ్గించడం లేదా పెంచడం చేయనున్నాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, పబ్లిక్ ఆయిల్ కంపెనీలు దీని కోసం సన్నద్ధమవుతున్నాయి. అలాగే, డిస్ట్రిబ్యూటర్స్ కూడా అందుకు తగ్గ ప్రణాళికలు చేసుకుంటున్నారు.

ఇప్పటివరకు, ఎల్‌పిజి సిలిండర్ ధరను నెలకు ఒకసారి నిర్ణయిస్తోన్న విషయం తెలిసిందే. తాజా వార్తలపై స్పందించిన చమురు కంపెనీల అధికారులు..సంస్థకు కలిగే నష్టాలను తగ్గించడానికి ఈ కొత్త నిబంధనను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు . గత నెల వరకు గ్యాస్ ధర తక్కువగా ఉన్నప్పటికీ, కంపెనీ  నెలపాటు నష్టాన్ని భరించాల్సి వచ్చిందని తెలిపారు. కొత్త వ్యవస్థను అమలు చేయడం ద్వారా నష్టాలను వారం తరువాత నియంత్రించవచ్చని వారు చెబుతున్నారు. ఈ నెలలో ఎల్పిజి సిలిండర్ ధర రెండుసార్లు పెరిగింది. దీనిపై మంగళవారం ఆయిల్ కంపెనీలు సమీక్ష నిర్వహించాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ప్రతి వారం ఎల్‌పిజి సిలిండర్ ధర మారుతుందని ఎల్‌పిజి పంపిణీదారుడు ఒకరు తెలిపారు. వీటికి సంబంధించి, చమురు కంపెనీల అధికారులు ఇంకా అధికారిక సమాచారం రాలేదని ఆయన చెప్పారు.

Also Read :UK New Coronavirus Strain: : లండన్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ప్రయాణీకుల్లో ఐదుగురుకి కరోనా పాజిటివ్