Om Birla Daughter: సివిల్ సర్వీసస్‌కు లోక్‌సభ స్పీకర్ కుమార్తె.. తొలి ప్రయత్నంలోనే విజయం..

|

Jan 05, 2021 | 10:47 PM

Om Birla Daughter: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. నిన్న UPSC విడుదల చేసిన 89 మందితో..

Om Birla Daughter: సివిల్ సర్వీసస్‌కు లోక్‌సభ స్పీకర్ కుమార్తె.. తొలి ప్రయత్నంలోనే విజయం..
Follow us on

Om Birla Daughter: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. నిన్న UPSC విడుదల చేసిన 89 మందితో కూడిన రిజర్వ్ లిస్టులో ఆమె ఉన్నారు. రామ్‌జాస్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన అంజలి.. 2019లో తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపిక అయ్యారు.

ఆ ఏడాది జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలను 2020, ఆగష్టు 4న ప్రకటించిన సంగతి తెలిసిందే. 927 పోస్టులకు 829 మందిని ఎంపిక చేయగా.. మిగిలిన వారి నుంచి 89 మందితో రిజర్వ్ జాబితాను యూపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ”సివిల్ సర్వీసెస్‌లో ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉంది. దేశ ప్రజల పట్ల నా తండ్రి నిబద్ధతను నేను ఎప్పుడూ చూస్తున్నందున సమాజం కోసం ఏదైనా చేయటానికి సివిల్ సర్వీసుల్లో చేరాలని కోరుకున్నాను” అని అంజలి తన స్పందనను తెలియజేశారు.

Also Read:

వాహనదారులకు అలెర్ట్.. ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ స్వాధీనం.. అమలులోకి వచ్చిన కొత్త రూల్.!

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం..

కోవిషీల్డ్ వ్యాక్సిన్.. కేంద్రం అనుమతిస్తే.. ఒక్కో డోస్ రూ. 1000: సీరం సంస్థ చీఫ్