సుప్రీంపై వ్యంగ్యాస్త్రాలు..స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బిగుస్తోన్న ఉచ్చు..శుక్రవారం కీలక ఉత్తర్వులు

|

Dec 17, 2020 | 1:36 PM

రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంపై వ్యంగ్యంగా  ట్వీట్లు చేసిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే.

సుప్రీంపై వ్యంగ్యాస్త్రాలు..స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బిగుస్తోన్న ఉచ్చు..శుక్రవారం కీలక ఉత్తర్వులు
Follow us on

రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంపై వ్యంగ్యంగా  ట్వీట్లు చేసిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. ఆయన కోర్టు ధిక్కరణ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కునాల్‌పై చర్యలకు  కేకే.వేణుగోపాల్ ఇప్పటికే అనుమతించారు. దీంతో క్రిమినల్ కంటెంప్ట్ కింద కునాల్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం,  అతడిపై చర్యలకు సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఓ లా విద్యార్థి, పలువురు  లాయర్లు ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. 

కాగా కునాల్ కమ్రా చేసిన కామెంట్లపై గతంలో కాస్త ఘాటుగానే స్పందించారు ఏజీ కేకే.వేణుగోపాల్. ఈ మధ్యకాలంలో ప్రజలు అత్యున్నత న్యాయస్థానాన్ని, జడ్జీలను అనుచితంగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఇందుకు చివరకు శిక్షార్హులవుతున్నారని ఆయన అన్నారు. కునాల్ ట్వీట్లు దారుణంగా ఉండడమే గాక, హాస్యానికి, ధిక్కరణకు మధ్య ఉన్న లక్ష్మణ రేఖను పూర్తిగా క్రాస్ చేశాయని ఆయన ఆరోపించారు. భావ ప్రకటనా స్వేఛ్చ పేరిట ఎవరుబడితే వారు ధైర్యంగా ఇలా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను తప్పుపడుతున్నారని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అయితే తాను చేసిన ట్వీట్లకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కామిక్ కునాల్ కమ్రా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Also Read :

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే

Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి

అనంతపురం నగరంలో కలకలం..పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు దుండగుల యత్నం