Telangana Congress: రేవంత్‌తో సంబంధం లేదు.. కోమటిరెడ్డి ఇన్‌డైరెక్ట్ బ్రేక్

|

Mar 12, 2020 | 1:15 PM

తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో వున్న నేతలిద్దరు తమ తమ ప్రయత్నాలు చేసుకుంటూనే.. ప్రత్యర్థుల అవకాశాలకు గండి కొట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష రేసులో వున్నారంటూ ప్రచారం పెరిగిన నేపథ్యంలో ఆయన అవకాశాలకు....

Telangana Congress: రేవంత్‌తో సంబంధం లేదు.. కోమటిరెడ్డి ఇన్‌డైరెక్ట్ బ్రేక్
Follow us on

Komatireddy Venkatreddy meets Sonia Gandhi: తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో వున్న నేతలిద్దరు తమ తమ ప్రయత్నాలు చేసుకుంటూనే.. ప్రత్యర్థుల అవకాశాలకు గండి కొట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష రేసులో వున్నారంటూ ప్రచారం పెరిగిన నేపథ్యంలో ఆయన అవకాశాలకు గండి కొట్టేందుకు టీపీసీసీ చీఫ్ రేసులో వున్న మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూపర్ ప్లాన్ వేశారు.

భువనగిరి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెడితే.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని చెప్పుకుంటున్నారు. ఇదే విఙ్ఞప్తితో ఆయన గురువారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఢిల్లీలో కలిశారు. తనకు బాధ్యతలు అప్పగిస్తే.. ఎలా వర్క్ చేస్తానో సోనియాకు వివరించారు వెంకటరెడ్డి. అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదే అయినా.. గత ఆరేళ్ళ స్వరాష్ట్రంలో కేవలం ఒక కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆయన తెలిపారు.

తనకు టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే.. తన యాక్షన్ ప్లాన్ ఏంటో వివరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రేసులో తనకు పోటీగా మారిన మల్కాజ్‌గిరి ఎంపీ, ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అవకాశాలకు గండి కొట్టేందుకు ఎత్తు వేశారు. అదే అంశాన్ని ఆయన సోనియాగాంధీకి వివరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదివరకే చాలా మంది సీనియర్లు టీఆర్ఎస్, బీజేపీలకు వెళ్ళిపోయారని, అలాంటి తరుణంలో ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇస్తే.. మరింత మంది సీనియర్లు పార్టీకి దూరమయ్యే ప్రమాదం వుందని, అదే జరిగితే వచ్చే ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని వెంకట రెడ్డి సోనియాగాంధీకి వివరించినట్లు తెలుస్తోంది.

సోనియాను కలిసిని తర్వాత మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి.. కొత్త వారికి కాకుండా.. మొదట్నించి పార్టీలో వున్న వారికే టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధినేత్రిని కోరినట్లు తెలిపారు. మునిసిపల్ ఎన్నికల తర్వాత టీపీసీసీ పదవి నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకే ప్రకటించినందున.. వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షున్ని ఎంపిక చేయాలని సోనియాను కోరినట్లు తెలిపారాయన.

Read this: Good news for Liquor lovers in Telangana మందుబాబులకు సర్కార్ శుభవార్త