చనిపోయిన మామయ్యకు రానా హాఫ్ సెంచరీ అంకితం

|

Oct 24, 2020 | 10:59 PM

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్​లో కోల్​కతా ఓపెనర్ నితీశ్ రానా అదరగొట్టాడు. 53 బంతుల్లో 81 రన్స్ చేసి, జట్టు భారీ స్కోరు చేయడంలో మేజర్ పాత్ర పోషించాడు.

చనిపోయిన మామయ్యకు రానా హాఫ్ సెంచరీ అంకితం
Follow us on

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్​లో కోల్​కతా ఓపెనర్ నితీశ్ రానా అదరగొట్టాడు. 53 బంతుల్లో 81 రన్స్ చేసి, జట్టు భారీ స్కోరు చేసి  జట్టు విజయంలో  మేజర్ పాత్ర పోషించాడు. అయితే ఈ హాఫ్  సెంచరీని, శుక్రవారం మరణించిన తన మామయ్య సురీందర్​కు అంకితమిచ్చాడు. ఈ మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా.. 42 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన నరైన్​తో కలిసిన ఓపెనర్ నితీశ్ రానా.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే నాలుగో వికెట్​కు 115 పరుగులు పార్టనర్షిప్ నెలకొల్పారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు కోల్​కతా 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

ఇక 195 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. బ్యాట్స్‌మెన్ తడబడటంతో నిర్ణీత ఓవర్లకు 135/9 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుస సెంచరీలతో జోరు మీదున్న ధావన్(6) పరుగులకే వెనుదిరగగా, రహానే డకౌట్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(47), పంత్(27) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి(5/12), కమిన్స్(3/17) ఢిల్లీ పతనంతో కీలక పాత్ర పోషించారు.

Also Read :

అక్కడ బుల్లెట్‌కు పూజలు, గుడి కూడా కట్టేశారు !

హైదరాబాదులో పాల ఏటీఎం