ఇడుక్కిలో.. 42కు చేరిన మృతుల సంఖ్య!

| Edited By:

Aug 09, 2020 | 4:44 PM

కేరళలో భారీ వర్షాల కారణంగా చాలా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఇడుక్కిలో కొండ‌చరియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మ‌రింత పెరిగింది. ఘ‌ట‌నా ప్రాంతంలోని శిథిలాల నుంచి

ఇడుక్కిలో.. 42కు చేరిన మృతుల సంఖ్య!
Follow us on

కేరళలో భారీ వర్షాల కారణంగా చాలా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఇడుక్కిలో కొండ‌చరియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మ‌రింత పెరిగింది. ఘ‌ట‌నా ప్రాంతంలోని శిథిలాల నుంచి ఆదివారం మ‌రో 16 మృతదేహాల‌ను వెలికి తీయడంతో మొత్తం మృతుల సంఖ్య 42కు చేరింది. ఇడుక్కి జిల్లా క‌లెక్ట‌ర్ ఈ విష‌యాన్ని ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. కేర‌ళ‌లో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో గ‌త శుక్ర‌వారం ఇడుక్కి జిల్లాలోని రాజ‌మలలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఇడుక్కిలో శుక్ర‌వారం రోజే 12 మృత‌దేహాల‌ను వెలికితీశారు. శ‌నివారం మొత్తం మృతుల సంఖ్య 26కు చేరింది. తాజాగా ఆదివారం మ‌రో ప‌ద‌హారు మృత‌దేహాలు ల‌భ్యం కావ‌డంతో ఈ ప్ర‌మాదంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 42కు చేరింది. కాగా, కొండ‌చ‌రియ‌ల కింద దాదాపు 80 మంది చిక్కుకుని ఉంటార‌ని, మ‌రిన్ని మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.

Read More:

30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!

ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!