YCP into NDA: ఎన్డీయేలోకి వైసీపీ.. కన్నా ఏమన్నారంటే..!

|

Feb 15, 2020 | 12:24 PM

Rumors on YCP-BJP friendship on full swing: మూడు రోజుల వ్యవధిలో రెండోసార్లు ఢిల్లీ వెళ్ళి, బీజేపీ అధినేతలను కల్వడంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోకి వైసీపీ చేరుతుందన్న ఊహాగానాల మిన్నంటాయి. కేంద్ర మంత్రి పదవులు ఖరారయ్యాయి, రాజ్యసభ సీట్లు కూడా ఆల్‌మోస్ట్ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిపోయిందంటూ కథనాలు వస్తున్నాయి. అయితే.. ఈ ఊహాగానాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనదైన శైలిలో స్పందించారు. టిడిపి, వైసీపీలకు సమాన దూరంలో ఉండాలనేది బీజేపీ […]

YCP into NDA: ఎన్డీయేలోకి వైసీపీ.. కన్నా ఏమన్నారంటే..!
Follow us on

Rumors on YCP-BJP friendship on full swing: మూడు రోజుల వ్యవధిలో రెండోసార్లు ఢిల్లీ వెళ్ళి, బీజేపీ అధినేతలను కల్వడంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోకి వైసీపీ చేరుతుందన్న ఊహాగానాల మిన్నంటాయి. కేంద్ర మంత్రి పదవులు ఖరారయ్యాయి, రాజ్యసభ సీట్లు కూడా ఆల్‌మోస్ట్ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిపోయిందంటూ కథనాలు వస్తున్నాయి. అయితే.. ఈ ఊహాగానాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనదైన శైలిలో స్పందించారు.

టిడిపి, వైసీపీలకు సమాన దూరంలో ఉండాలనేది బీజేపీ విధానమని తేల్చి చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ. అయితే, ఎన్డీయేలో వైసీపీ పార్టీ చేరడంపై తమకు సమాచారం లేదన్నారాయన. ఈ విషయం మా పార్టీ ఇంఛార్జులు ఇప్పటికే ప్రకటన చేశారని, మరి మంత్రి బొత్స ఎందుకలా మాట్లాడారో తెలియడం లేదని కన్నా అన్నారు. పరిపాలనా పరమైన అంశాలపై మాత్రమే ప్రధానితో, కేంద్ర హోం మంత్రితో ముఖ్యమంత్రి జగన్ సమావేశం జరిగి వుంటుందని, ఈ భేటీలకు రాజకీయాలకు సంబంధం వుండి వుండదని కన్నా అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని, కడపలో బీజేపీ నేతలపై దాడి చేసి..తిరిగి కేసులు పెట్టారని కన్నా ఆరోపించారు. ఇసుక దందాను అడ్డుకున్నారన్న కోపంతో బీజేపీ ఎస్టీ విభాగం ఇంచార్జ్ సత్యనారాయణపై కేసులు పెట్టారని ఆయన వివరించారు. గతంలో ఎన్నడూ ఇంత దారుణమైన పరిస్థితిని ఏపీలో చూడలేదంటున్నారు కన్నా.

Also read: Crucial point for Jagan, Amit Shah meeting