కరోనా మహమ్మారికి.. తక్కువ ఫీజుతో.. నాణ్యమైన చికిత్స..!

| Edited By:

Aug 06, 2020 | 12:43 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈ మహమ్మారికి వైద్యం చాలా ఖరీదైపోయింది.ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నాయి. సాధారణ

కరోనా మహమ్మారికి.. తక్కువ ఫీజుతో.. నాణ్యమైన చికిత్స..!
Follow us on

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈ మహమ్మారికి వైద్యం చాలా ఖరీదైపోయింది.ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నాయి. సాధారణ దగ్గు, జలుబు,జ్వరం వంటి లక్షణాలు ఉండి కోవిడ్‌ పేషెంట్‌ అయితే చాలు నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. మరోవైపు సర్కార్‌ దవఖానాలు పేషెంట్‌లకు గట్టి భరోనాను ఇవ్వలేకపోతున్నాయి.

జైన్‌ ఇంటర్నేషనల్ అనే స్వచ్చంద సంస్థ అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలను అందజేసేందుకు వంద పడకల ‘ కోవిడ్‌కేర్‌ సెంటర్‌’తో ముందుకు వచ్చింది. దాతల సహాయ సహకారాలతో పని చేస్తున్న ఈ సంస్థ విద్య, వైద్య రంగాల్లో తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 15 కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. తాజాగా 16వ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. బేగంపేట్‌లోని మానస సరోవర్‌లో 100 పడకలతో, అన్ని రకాల సదుపాయాలతో ఈ ఆసుపత్రిని బుధవారం అందుబాటులోకి తెచ్చారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాలకు అనుగుణంగా, వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ ఆసుపత్రిలో కోవిడ్‌ బాధితులకు వైద్య సేవలు లభిస్తాయి. కేవలం నామమాత్రపు ఫీజులతో అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నట్లు జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి వినోద్‌ రాంకా తెలిపారు.

Read More:

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!