టోక్యో ఒలింపిక్స్ పై జపాన్ ప్రధాని క్లారిటీ !

|

Sep 26, 2020 | 9:24 PM

కోవిడ్ 19 మహమ్మారి విరుచుకుపడటంతో ఈ ఏడాది జరగాల్సిన చాలా గేమ్ ఈవెంట్లు రద్దయ్యాయి. అందులో టోక్యో ఒలంపిక్స్ కూడా ఒకటి.

టోక్యో ఒలింపిక్స్ పై జపాన్ ప్రధాని క్లారిటీ !
Follow us on

Tokyo Olympics 2021 :కోవిడ్ 19 మహమ్మారి విరుచుకుపడటంతో ఈ ఏడాది జరగాల్సిన చాలా గేమ్ ఈవెంట్లు రద్దయ్యాయి. అందులో టోక్యో ఒలంపిక్స్ కూడా ఒకటి. దీంతో  2021 లో టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు జపాన్ ప్రధాని యోషిహిదే సుగా. 2021లో ఒలింపిక్స్‌కు  ఆతిథ్యం ఇవ్వడానికి తమ ప్రభుత్వం నిశ్చయించుకుందని  ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చెప్పారు. (డెంగ్యూతో కూడా డేంజరే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి !)

“వచ్చే ఏడాది వేసవిలో టోక్యో ఒలింపిక్,  పారాలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి జపాన్ నిశ్చయించుకుంది, మానవత్వం కరోనాను ఓడించింది” అని సుగా శుక్రవారం రికార్డ్ చేసిన సందేశంలో తెలిపారు. 

ఆరోగ్యం సరిగా లేనందున షింజో అబే పదవీవిరమణ చేసిన తరువాత ఈ నెలలో సుగా ప్రధాని అయ్యారు. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వచ్చే ఏడాది ఒలంపిక్ గేమ్స్‌  నిర్వహించే ప్రణాళికలో భాగంగా  సిబ్బంది సంఖ్యను తగ్గించాలని, శిక్షణా వేదికల ప్రారంభ వ్యవధిని తగ్గించాలని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రతిపాదించారు. వచ్చే వేసవి నాటికి మహమ్మారి అదుపులో లేనట్లయితే ఈ గేమ్స్ నిర్వహించడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరించారు. అయితే ఒలింపిక్ అధికారులు ఆటలు నిర్వహించాల్సిందేనని పట్టుబడుతున్నారు. 

Also Read :  ఈ సారి తిరుమల, తిరుపతి పోలీసులు బుక్కయ్యారు