లాక్‌డౌన్‌లో సైలెంట్‌గా.. ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ కమెడియన్ మహేష్ ఓ ఇంటివాడయ్యాడు. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన మహేష్.. చిన్న చిన్న పాత్రలతో వెండితెర మీద కూడా రాణిస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఇలా గుట్టుచప్పుడు కాకుండా.. నిరాడంబరంగా పెళ్లి చేసుకొన్నాడు. ఈ రోజు ఉదయం 14వ తేదీన 6.31..

లాక్‌డౌన్‌లో సైలెంట్‌గా.. ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్

Updated on: May 14, 2020 | 1:51 PM

జబర్దస్త్ కమెడియన్ మహేష్ ఓ ఇంటివాడయ్యాడు. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన మహేష్.. చిన్న చిన్న పాత్రలతో వెండితెర మీద కూడా రాణిస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఇలా గుట్టుచప్పుడు కాకుండా.. నిరాడంబరంగా పెళ్లి చేసుకొన్నాడు. ఈ రోజు ఉదయం 14వ తేదీన 6.31 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామంలో వధువు ఇంటి వద్ద.. కొద్ది మంది బంధువుల సమక్షంలో మహేష్, పావనీల వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయ పద్దతిలో శాస్త్రోక్తంగా వీరి పెళ్లి జరిగింది.

కాగా జబర్దస్త్‌లో కిరాక్ ఆర్పీ టీమ్‌లో మహేష్ కీలక కమెడియన్‌గా ఉండటంతో పాటు ఆ టీమ్‌కు వెన్నుముకగా నిలిచాడు. మహేష్ వేసే పంచులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలా బుల్లి తెర నుంచి వెండితెరపై కూడా తన కామెడీని కొనసాగిస్తున్నాడు మహేష్. ఇటీవల శతమానం భవతి, రంగస్థలం, గుణ 369 వంటి చిత్రాల్లో మహేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Read More:

గుడ్‌న్యూస్: అక్కడ విద్యార్థులకు టెన్త్ పరీక్షలు లేవు.. డైరెక్ట్ పాస్!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

లాక్‌డౌన్‌లో సింపుల్‌గా హీరో నిఖిల్ పెళ్లి..

Loading...
Unable to load recommendations.
Follow Us