ITR Filing: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్… యోనో యాప్ ద్వారా ఐటీఆర్ ఫైలింగ్ సౌకర్యం…

| Edited By:

Jan 04, 2021 | 8:21 AM

మీరు ఎస్బీఐ ఖాతాదారులా..? అయితే మీకు ఓ గుడ్ న్యూస్.... ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ తమ ఖాతాదారులకు యోనో ద్వారా...

ITR Filing: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్... యోనో యాప్ ద్వారా ఐటీఆర్ ఫైలింగ్ సౌకర్యం...
Follow us on

మీరు ఎస్బీఐ ఖాతాదారులా..? అయితే మీకు ఓ గుడ్ న్యూస్…. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ తమ ఖాతాదారులకు యోనో ద్వారా ఆదాయం పన్ను (ఐటీ) రిటర్నులను ఉచితంగా దాఖలు చేసే సౌకర్యాన్ని అందించింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లో ఎస్బీఐ యోనో యాప్‌ను ఓపెన్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.

 

ఆపై ‘షాప్‌ అండ్‌ ఆర్డర్‌’కు వెళ్లి ట్యాక్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌పై క్లిక్‌ చేయాలి. tax2win కనబడితే మరిన్ని వివరాల కోసం దానిపై క్లిక్‌ చేయాలి. ఈ పద్ధతిలో మీకు ఇబ్బందులు ఎదురైతే +91 9660-99-66-55 నెంబర్‌కు కాల్‌ చేయవచ్చుని తెలిపింది. లేదంటే support@tax2win.inకు ఈమెయిల్‌ పంపవచ్చు. అలాగే చార్టెడ్‌ అకౌంటెంట్‌ సహాయాన్ని తీసుకోవాలనుకుంటే కనీస చార్జీగా రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 మదింపు సంవత్సరం)గాను ఐటీఆర్‌ దాఖలుకున్న గడువును డిసెంబర్ 31 నుంచి జనవరి 10కి పొడిగించిన విషయం తెలిసిందే.

Also Read: MS Dhoni and Ziva : కూతురుతో కలిసి కనిపించబోతున్న మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్…