YSRCP internal fight: అధికారపార్టీలో ఆధిపత్య పోరు..కారుపై దాడిచేసిందెవరు?

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 5:35 PM

గుంటూరు రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. చిలకలూరిపేట వైసీపీలో ఆధిపత్య పోరు ముదిరింది. ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే ఫైట్‌లో పాత ప్రత్యర్ది రావడంతో జిల్లాలో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది.

YSRCP internal fight: అధికారపార్టీలో ఆధిపత్య పోరు..కారుపై దాడిచేసిందెవరు?
Follow us on

Known persons attacked MLA Rajini car: గుంటూరు రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. చిలకలూరిపేట వైసీపీలో ఆధిపత్య పోరు ముదిరింది. ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే ఫైట్‌లో పాత ప్రత్యర్ది రావడంతో జిల్లాలో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అసలు చిలకలూరి పేటలో ఏం జరుగుతోంది? తిరునాళ్ల వేదికగా తలెత్తిన వివాదానికి కారణాలేంటి ?

ఇప్పుడు చిలూకలూరిపేట వైసీపీలో గ్రూప్‌ వార్‌ పీక్‌ స్టేజీకి చేరింది. బుధవారం రాత్రి చిలుకలూరిపేటలో ఉంటున్న బైరాకృష్ణ ఇంటికి నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వెళ్లారు. ఆయన రాకను ఎమ్మెల్యే విడదల రజనీ వర్గం అడ్డుకుంది. ఎన్నికల సమయంలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, రజనీకి విభేదాలు ఉన్నాయి. అప్పట్లో రాజశేఖర్‌ ప్లెక్సీలను… ఎమ్మెల్యే రజనీ వర్గం చించేయడం పెద్ద చర్చకు దారితీసింది. దీనికి తోడు మర్రి రాజశేఖర్‌తో ఎంపీ లావు కృష్ణదేవరాయలకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తమకు వ్యతిరేకంగా ఓ సామాజిక వర్గం నేతలు ఒక్కటై కుట్రలు చేస్తున్నారని రజనీ వర్గం ఆరోపిస్తోంది.

ఎంపీ ఘటన తర్వాత…కేవలం 24 గంటల వ్యవధిలోనే చిలకలూరిపేట MLA విడదల రజని కారుపై రాళ్ల దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు కారులో భర్త, మరిది గోపి మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్యేకి చెందిన ప్రభను కోటప్పకొండలో పెట్టి వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. లోపలున్న ఎమ్మెల్యే మరిదికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది.

తన కుటుంబంపై హత్యాయత్నం జరిగిందని…దీని వెనుక మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన అనుచరులే ఉన్నారని ఎమ్మెల్యే విడదల రజనీ ఆరోపించారు. తమ సహనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని ….తమను రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే రజనీ మధ్య ఉన్న విభేదాలే దాడికి కారణమయ్యాయని టీడీపీ నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అంటున్నారు. వాళ్ల ఆధిపత్య పోరులో జరుగుతున్న దాడులను టీడీపీ నేతలపై రుద్దడం సమంజసం కాదన్నారు. మొత్తానికి చిలకలూరిపేట వైసీపీలో ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. లోకల్‌ ఎలక్షన్స్‌ ముందున్న తరుణంలో పార్టీలో ఈ ఫైట్‌ ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన వైసీపీ కార్యకర్తల్లో కనిపిస్తోంది.

Read this: TDP finding no leader in Gannavaram constituency