IND Vs NZ: కోహ్లీ ఖాతాలోకి మరో వరస్ట్ రికార్డు.. 19 ఇన్నింగ్స్‌లో 0 సెంచరీలు..

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 5:09 PM

ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటేనే సెంచరీలకు కేర్ ఆఫ్ అడ్రెస్.. ఫార్మాట్ ఏదైనా శతకం బాదాల్సిందే. అలాంటి రన్ మిషన్ ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది.

IND Vs NZ: కోహ్లీ ఖాతాలోకి మరో వరస్ట్ రికార్డు.. 19 ఇన్నింగ్స్‌లో 0 సెంచరీలు..
Follow us on

India Vs New Zealand: ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటేనే సెంచరీలకు కేర్ ఆఫ్ అడ్రెస్.. ఫార్మాట్ ఏదైనా శతకం బాదాల్సిందే. అలాంటి రన్ మిషన్ ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. గత 19 ఇన్నింగ్స్‌లో అతడు ఒక్క శతకం కూడా సాధించకపోవడం గమనార్హం. కివీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో విరాట్ కేవలం రెండు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌తో కలిపి గత 19 ఇన్నింగ్స్‌లో అతడు మూడంకెల స్కోర్ దాటలేదు.  కోహ్లీ కెరీర్‌లో ఇలా జరగడం ఇది మూడోసారి.

Also Read: IPL All Stars Match End Of The Tournament

కెప్టెన్‌గా అతడు బాధ్యతలు తీసుకున్న మొదటిసారి 2011 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకు వరుసగా 24 ఇన్నింగ్స్‌ల్లో శతకం నమోదు చేయలేదు.. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ వరకు వరుసగా 25 ఇన్నింగ్స్‌ల్లో.. ఇక లేటెస్ట్‌గా 19 ఇన్నింగ్స్‌లో సెంచరీ నమోదు చేయకుండానే ఈ పరుగుల ధీరుడు వెనుదిరిగాడు.

Also Read: Prajyan Ojha Retirement

ఇదిలా ఉంటే 2014 ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. అప్పుడు అతడి బ్యాటింగ్ శైలిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ప్రస్తుతం కివీస్ పర్యటనలో కోహ్లీ మూడు ఫార్మాట్లు కలిపి 8 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. అందులో కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే ఉంది.

Also Read: Mayank Agarwal Achieved Rare Feat In Tests

Also Read: T20 Women’s World Cup India Stellar Show In Opening Match