’80’ అంటే భయపడుతోన్న టీమిండియా.. కోహ్లీ, పుజారాతో సహా నలుగురు బలి.. ఇదేం సెంటిమెంట్‌ అంటూ షాకవుతోన్న నెటిజన్లు..!

|

Dec 03, 2021 | 10:19 PM

Indian Cricket Team: ముంబై టెస్టులో తొలి రోజు భారత్ 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఇందులో మయాంక్ అగర్వాల్ తన కెరీర్‌లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. అలాగే '80' నుంచి తప్పించుకోగలిగిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

80 అంటే భయపడుతోన్న టీమిండియా.. కోహ్లీ, పుజారాతో సహా నలుగురు బలి.. ఇదేం సెంటిమెంట్‌ అంటూ షాకవుతోన్న నెటిజన్లు..!
సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేయకుండానే 2021 సంవత్సరాన్ని ముగించాడు. 33 ఏళ్ల కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు చేసి ఔటయ్యాడు.
Follow us on

India Vs New Zealand 2021: ముంబై టెస్టులో తొలి రోజు భారత జట్టుకు ఒడిదొడుకులు ఎదురయ్యాయి. టీమ్‌ఇండియా శుభారంభం చేసి ఆ తర్వాత ఇన్నింగ్స్‌ మధ్యలో తడబడింది. ఆ తర్వాత మెరుగైన స్థితిలో నిలిచి తొలిరోజును ముగించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుతంగా ఆడి సెంచరీ చేయగా, శుభ్‌మన్ గిల్ 44 పరుగులు చేశాడు. ఇండియా ఇన్నింగ్స్‌లో వీరే అత్యుత్తమంగా నిలిచాడు. మరోవైపు, చెతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తమ బ్యాడ్ ఫేజ్‌ను విడిచిపెట్టలేకపోయారు. అదే సమయంలో, గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. విశేషమేమిటంటే.. 80 వీరికి కలిసి రాలేదు. టీమ్ ఇండియాను కష్టాల్లోకి నెట్టేసిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ చేతిలో భారత్ బ్యాట్స్ మెన్ అంతా బలయ్యారు.

వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, మయాంక్ అగర్వాల్ (120 నాటౌట్) నాలుగో టెస్టు సెంచరీతో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత్‌కు ఓపెనింగ్‌ జోడీ మయాంక్‌, శుభ్‌మన్‌లు శుభారంభం అందించి అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మధ్యలో అజాజ్ పటేల్ వరుసగా 2 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి భారత్ ఆరంభాన్ని చెడగొట్టాడు. ఆ తర్వాత మయాంక్, శ్రేయాస్ అయ్యర్‌తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే అయ్యర్ కూడా అజాజ్‌కు బలి అయ్యాడు. చివరికి వృద్ధిమాన్ సాహా (25 నాటౌట్) మయాంక్‌కు మద్దతుగా నిలిచాడు. ఆట ముగిసే వరకు మరోవికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు.

కలసిరాని ’80’..
టీమ్ ఇండియాకు సంబంధించి 80 అనే ఫిగర్ అస్సలు కలసిరాలేదు. తొలిరోజు టీమ్ ఇండియాకు అడ్డంకిగా మారిన ’80’ ఫిగర్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ 80 సంఖ్య భారత వికెట్ల పతనానికి సంబంధించినది. ఇది శుభమాన్ గిల్‌తో ప్రారంభమైంది. 44 పరుగుల వద్ద అజాజ్ పటేల్ బౌలింగ్‌లో శుభ్‌మన్ స్లిప్‌లో ఔటయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 80 పరుగులు. ఈ 80 పరుగుల వద్దే అజాజ్ పటేల్ భారీగానే దెబ్బ తీశాడు. ఈ ఉచ్చులో పుజారా, కోహ్లి కూడా చిక్కుకున్నారు. ఇద్దరూ ఒకే ఓవర్‌లో అజాజ్‌ బారిన పడ్డారు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో కూడా భారత్ స్కోరు 80 పరుగులు కావడం విశేషం.

ఈ 80 డిజిట్ విధ్వంసం ఇక్కడితో ముగియలేదు. శ్రేయాస్ అయ్యర్ దాని తదుపరి బాధితుడిగా మారాడు. అరంగేట్రంలోనే సెంచరీ చేసిన అయ్యర్, మయాంక్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ, జట్టు స్కోరు 160 పరుగుల వద్ద ఉన్నప్పుడు అయ్యర్ కూడా అజాజ్ బంతికి ఔటయ్యాడు. శ్రేయాస్ ఔట్ అయినప్పుడు మయాంక్‌తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

మయాంక్ అగర్వాల్ మాత్రమే..
ఈ 80 డిజిట్‌తో ఒక బౌలర్ టీమిండియా నలుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు. అయితే, మయాంక్ అగర్వాల్ తన పూర్తి ఇన్నింగ్స్ బలంతో ఈ సంఖ్య నుంచి తప్పించుకున్నాడు. అతని టెస్ట్ కెరీర్‌లో నాల్గవ సెంచరీని సాధించడం ద్వారా భారతదేశాన్ని మెరుగైన స్థితిలో ఉంచాడు. మయాంక్, సాహా 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండవ రోజు వీరిద్దరు 80 పరుగుల అడ్డంకిని దాటగలరని భారత జట్టు భావిస్తోంది.

Also Read: Cricket: 17 బంతుల్లో 78 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో వీరవిహారం.!

IND vs NZ: 132 ఏళ్ల క్రికెట్‌లో తొలిసారి.. స్పెషల్ రికార్డు సృష్టించిన భారత్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. ఎందులోనే తెలుసా..!