India Vs Australia 2020: ఆసీస్‌లో మనోళ్ల కష్టాలు.. బీసీసీఐకి కంప్లయింట్ ఇచ్చిన రహనే అండ్ కో..

|

Jan 13, 2021 | 3:16 PM

India Vs Australia 2020: జిమ్ నాసిరకంగా ఉండటం... స్విమ్మింగ్ పూల్ లేకపోవడం... హౌజ్‌ కీపింగ్ సేవలు సరిగా లేకపోవడం..

India Vs Australia 2020: ఆసీస్‌లో మనోళ్ల కష్టాలు.. బీసీసీఐకి కంప్లయింట్ ఇచ్చిన రహనే అండ్ కో..
Follow us on

India Vs Australia 2020: జిమ్ నాసిరకంగా ఉండటం… స్విమ్మింగ్ పూల్ లేకపోవడం… హౌజ్‌ కీపింగ్ సేవలు సరిగా లేకపోవడం.. ఇలా ఒకటేమిటీ.. ఇంకా ఎన్నో సౌకర్యాల సరిగ్గా లేకపోవడంతో టీమిండియా ఆటగాళ్లు నాలుగో టెస్టుకు ముందు ఇబ్బందులు పాలవుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటన చివరి అంకానికి చేరుకుంది. జనవరి 15న బ్రిస్బేన్ వేదికగా జరగబోయే నాలుగో టెస్టుతో సిరీస్ ముగుస్తుంది.

ఈ క్రమంలోనే రెండు జట్ల ఆటగాళ్లు గబ్బా చేరుకున్నారు. అక్కడ ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. అయితే ఆ హోటల్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీనితో ఇండియన్ ప్లేయర్స్ బోర్డుకు మొరపెట్టుకున్నారు. ఇక ఆటగాళ్ల కంప్లయింట్‌తో రంగంలోకి దిగిన బీసీసీఐ.. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియాతో సంప్రదింపులు జరిపింది.

టీమిండియా ఆటగాళ్లకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని.. కఠినమైన నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని సీఏ తెలిపింది.  ఏది ఏమైనా క్రికెట్ ఆస్ట్రేలియా గబ్బాలో చేసిన ఏర్పాట్లుపై టీమిండియా ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొంతమంది తమ ఫ్యామిలీలతో పర్యటించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.