Onion Tips: ఉల్లిపాయ కోస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

|

Mar 25, 2022 | 6:53 PM

ఉల్లిగడ్డ(Onion)లో ఎన్నో దివ్య ఔషదగుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదనే సామేత పుట్టుకొచ్చింది...

Onion Tips: ఉల్లిపాయ కోస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Onion
Follow us on

ఉల్లిగడ్డ(Onion)లో ఎన్నో దివ్య ఔషదగుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదనే సామేత పుట్టుకొచ్చింది. ఉల్లిగడ్డలేని కూర లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఈ ఉల్లిపాయ తరగడం మాత్రం కాస్త కష్టమైన విషయమే. కొంతమంది ఉల్లిపాయను తరగాలంటే బయపడుతుంటారు. కారణం.. దాని నుంచి వచ్చే ఘాటుకు కళ్లు మండటం, నీళ్లు కారడం, ముక్కు కారడం వంటి సమస్యలను వస్తాయని. ఈ బాధ ఉండకూడదంటే కొన్ని టిప్స్(Tips) ఫాలో అవ్వాల్సిందే. ఉల్లిపాయలను తరిగేముందు వాటిని కాసేపు వెనిగర్‌(weniger)లో ఉంచాలి. అలా ఉంచితే వాటిని కోసేటప్పుడు ఘాటు అంతగా రాదు. దాంతో కన్నీల్లు కూడా రావు. ఇలా కాదు అనుకుంటే ఉల్లిపాయలను రెండు లేదా మూడు గంటల ముందు ఫ్రిజ్‌లో పెట్టాలి. అలా పెట్టిన ఉల్లిపాయలను కోసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు తరిగేటప్పుడు వాటినుంచి రిలీజయ్యే ఘాటు తక్కువగా వస్తుంది. ఉల్లిగడ్డల్లో ఉండే ఎంజైమ్స్ తక్కువ పరిమాణంలో రిలీజ్ అవుతాయి. దానివల్లే కళ్లు మండవు, కన్నీళ్లు రావు. ఉల్లిపాయలను తరిగేటప్పుడు కింది నుంచి కోయండి. పైభాగం నుంచి కాకుండా కింది భాగం నుంచి కోయడం వల్ల ఉల్లిగడ్డను తొందరగా తరుగుతారు. దీనివల్ల కూడా కన్నీళ్లు రావు. ఉల్లిపాయలను తరిగేటప్పుడు నిమ్మకాయను ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయలను తరిగేటప్పుడు కత్తికి కాస్త నిమ్మరసం అప్లై చేయండి. ఇలా చేస్తే ఉల్లిపాయనుంచి వచ్చే ఘాటు తగ్గుతుంది. దీనివల్ల మీరు కన్నీళ్లు పెట్టుకోవాల్సి అవసరం ఉండదు.

ఎన్నో లాభాలను కలిగించే ఈ ఉల్లిపాయను కొంతమంది అస్సలు తినకూడదు. షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండే వ్యాధిని హైపో గ్లైసిమియా అంటారు. ఈ వ్యాధి బారిన పడ్డవారు ఉల్లిగడ్డను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఉల్లిగడ్డ వీరిలో షుగర్ లెవెల్స్‌ను మరింత తగ్గిస్తుంది. విటమిన్ కె ఎక్కువ మొత్తంలో ఉండే వాళ్లు కూడా ఉల్లిని తినకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అంతగా తినాలంటే చాలా తక్కువ మొత్తంలోనే తినాలని నిపుణులు సలహాలనిస్తున్నారు. వీరు ఉల్లిని ఎక్కువ తింటే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందట. లేదా గుండె నొప్పి బారిన పడొచ్చంటున్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో బాధపడేవారు ఉల్లిని పూర్తిగా మానేయడమో లేకపోతే తక్కువగా తినడమో చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిలో ఉండే ఫ్రక్టోజ్ గ్యాస్ ప్రాబ్లమ్‌ను మరింత పెంచుతుంది. గుండెకు సంబంధించిన జబ్బులున్న వారు ఉల్లిగడ్డలను తినకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

అయితే ఉల్లి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉల్లిలో ఔషధాలతోపాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, సల్ఫర్‌ లాంటివి ఉన్నాయి. ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. కావున క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. మూత్ర సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది. దంతక్షయాన్ని, దంతాల్లో ఉండే ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి ఉల్లిపాయ సహాయపడుతుంది.

Note: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఆహారంలో మార్పులు చేసే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి.

Read Also .. Jackfruit Health Benefits: Do not forget to eat these even after eating pineapple .. Avento would be shocked to know ..