అంతర్జాతీయ క్రికెట్‌కు ఇయాన్ బెల్ వీడ్కోలు..

|

Sep 06, 2020 | 4:38 PM

ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ బెల్ తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల బెల్ ఇంగ్లాండ్ జట్టు తరపున 2004లో అరంగేట్రం చేసి.. 161 వన్డేలు, 118 టెస్టులు, 8 టీ20లు ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇయాన్ బెల్ వీడ్కోలు..
Follow us on

ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ బెల్ తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల బెల్ ఇంగ్లాండ్ జట్టు తరపున 2004లో అరంగేట్రం చేసి.. 161 వన్డేలు, 118 టెస్టులు, 8 టీ20లు ఆడాడు. ఇంగ్లీష్ జట్టులో బెల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మిడిల్ ఆర్డర్‌లో స్టైలిష్ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో కీలక మ్యాచుల్లో ఇంగ్లాండ్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. (Ian Bell Retirement)

తన కెరీర్‌ గురించి వివరిస్తూ ట్విట్టర్ వేదికగా బెల్ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. చాలాకాలంగా జట్టుకు సెలెక్ట్ కాని బెల్.. మొత్తంగా తన కెరీర్‌లో టెస్టుల్లో 7,227 పరుగులు చేయగా అందులో 22 సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో అయితే 5,416 పరుగులు చేశాడు. అటు డొమెస్టిక్ క్రికెట్‌లో కూడా బెల్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. కాగా, 2015లో వన్డే కెరీర్‌కు బెల్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.