Breaking News
 • అమరావతి: హైకోర్టును ఆశ్రయుంచిన ఆన్ -ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యం. ప్రభుత్వం జారీ చేసిన 155 మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ.. 155 మెమోను సస్పెండ్ చేయాలని కోరుతూ న్యాయవాది వాదనలు.. ప్రవేట్ స్కూల్లోని విద్యార్థుల డేటాను యాజమాన్యానికి తెలియ కుండా తొలగిస్తున్నారన్న న్యాయవాది.. పూర్తి వివరాలతో కౌoటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా..
 • హేమంత్ హత్య కేసు: ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేసాము. నిందితులు లక్ష్మ రెడ్డి,యుగేంద్రర్ రెడ్డి ని 6 రోజులపాటు కస్టడీకి అనుమతించిన కోర్టు. ఈ రోజు నిందితులను కస్టడీకి తీసుకుంటాం.
 • కరోనా వారియర్స్‌: తూ.గో: కరోనాను జయించిన ఎస్పీ అద్నన్‌ నయీం అస్మీ, ఏఎస్పీ కరణం కుమార్‌. విధుల్లో చేరేందుకు వచ్చిన వీరిపై సిబ్బంది పూలవర్షం . ఘనస్వాగతం పలికిన తోటి పోలీసులు.
 • ఉప ఎన్నికలకు పచ్చజెండా : ఢిల్లీ: కర్నాటకలో ఉప ఎన్నికలకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌. 2 కౌన్సిల్‌, 2 ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ . అక్టోబర్‌ 28న పోలింగ్‌, నవంబర్‌ 2న కౌంటింగ్‌ . గత జూన్‌ 30న ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు .
 • విశాఖ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన దీక్ష, పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకే మోదీ చట్టాన్ని తీసుకొచ్చారని నారాయణ విమర్శలు.
 • ప్రచారంలో వాస్తవంలేదు . ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడి పేరును లోకేష్‌ వ్యతిరేకిస్తున్నా ప్రచారంలో నిజంలేదు. అవి కేవలం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే-టీడీపీ వర్గాలు .
 • బతుకమ్మ చీరల ప్రదర్శన : హైదరాబాద్‌: హరితప్లాజాలో బతుకమ్మ చీరల ప్రదర్శన. ప్రదర్శనను తిలకిస్తున్న మంత్రులు కేటీఆర్‌, సబిత ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్‌ . మరికాసేపట్లో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం .
 • వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం. ఖరీఫ్‌ పంట చేతికొస్తుంది, అక్టోబర్‌ 15 నుంచి ధ్యాసపెట్టాలి. ఆర్‌బీకేల ద్వారా మన ప్రొక్యూర్‌మెంట్‌ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలి. ఈ క్రాపింగ్‌ ప్రతీ పంటకు పూర్తి చేయాలి. ప్రతీ రైతు వివరాలు ఈ క్రాపింగ్‌లో పక్కాగా ఉండాలి, సోషల్‌ ఆడిట్‌ చేయాలి, మిస్‌ అయితే వెంటనే నమోదుచేయాలి. ఫామ్‌గేట్‌ అనేది ప్రతీ పంటకూ చేయాలి. కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్‌ చేస్తామని చెప్పాలి. ఎక్కడా కూడా మ్యాన్యువల్‌ సర్టిఫికెట్‌ ఉండకూడదు, ఈ క్రాపింగ్‌ తప్పనిసరిగా జరగాలి.

MS Dhoni Retirement: మహేంద్రుడి రివార్డులు.. అవార్డులు..

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కొద్దిసేపటి క్రితమే తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ధోని భారత్ జట్టుకు ఎన్నో అద్భుతమైన, చిరస్మరణీయమైన విజయాలు అందించాడు.

MS Dhoni Retirement, MS Dhoni Retirement: మహేంద్రుడి రివార్డులు.. అవార్డులు..

MS Dhoni Retirement: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కొద్దిసేపటి క్రితమే తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ధోని భారత్ జట్టుకు ఎన్నో అద్భుతమైన, చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. 2007లో రాహుల్ ద్రావిడ్ తర్వాత ధోని భారత్ జట్టు పగ్గాలు చేపట్టాడు. మైదానంలో తన దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్ధులను బెంబేలెత్తించడమే కాకుండా వికెట్ల వెనుక తన వ్యూహాలు అమోఘం అని చెప్పాలి. భారత్ జట్టుకు విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగిన ధోని.. ఎంతోమంది ఆటగాళ్ళకు, కెప్టెన్లకు ఫేవరెట్ పర్సన్. ఇక ఈ లెజెండరీ ప్లేయర్ సాధించిన రివార్డులు.. అవార్డులు గురించి తెలుసుకుందాం.

ధోనికి వచ్చిన అవార్డులు..

 • 2009. 2010, 2013 సంవత్సరాల్లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ టీంలో చోటు..
 • 2006,2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014లో ఐసీసీ వన్డే టీంలో చోటు..
 • 2008, 09లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు..
 • 2006లో ఎంటీవీ యూత్ ఐకాన్ అవార్డు
 • 2007-08లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు
 • 2009లో పద్మశ్రీ అవార్డు
 • 2011లో లెఫ్టినెంట్ కల్నల్ హోదా
 • 2018లో పద్మభూషణ్ అవార్డు

ధోని కెప్టెన్సీలో భారత్‌ జట్టుకు అద్భుత విజయాలు..

 1. 2013లో టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసిన భారత్
 2. అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచినా కెప్టెన్ గా ధోని రికార్డు
 3. 2007లో టీ20 వరల్డ్ కప్
 4. 2011లో వన్డే వరల్డ్ కప్
 5. టెస్టుల్లో నెంబర్ వన్ స్థానానికి భారత్‌ను చేర్చాడు ధోని
 6. అన్ని ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ ను విజేతగా నిలిపి విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు ధోని

Also Read: అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

Related Tags