వరద బీభత్సం, 15 గంటలు ఇంటి టెర్రస్‌పైనే విశ్రాంత శాస్త్రవేత్త

|

Oct 16, 2020 | 5:43 PM

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. వరసగా మూడు రోజులపాటు కురిసిన వర్షాన్ని నగరంలోని చాలా ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది.

వరద బీభత్సం, 15 గంటలు ఇంటి టెర్రస్‌పైనే విశ్రాంత శాస్త్రవేత్త
Follow us on

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. వరసగా మూడు రోజులపాటు కురిసిన వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి, నిత్యావసరాలు లేక నగర ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. కాగా 65 ఏళ్ల ఓ వ్యవసాయ విశ్రాంత శాస్త్రవేత్త, అతడి 81 ఏళ్ల తల్లి వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. వదర తీవ్రతతో వారి ఇళ్లు మొత్తం నీట మునిగిపోగా, దాదాపు 15 గంటల పాటు ఇంటి టెర్రస్‌పైనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ తర్వాత రెస్క్యూ టీమ్ సాయంతో బ్రతుకు జీవుడా అంటూ విపత్తు నుంచి బయటపడ్డారు.  ఈ ఘటన సరూర్ నగర్‌లో చోటుచేసుకుంది. ( దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై ! )

వివరాల్లోకి వెళ్తే..భారీ వర్షానికి సరూర్ నగర్‌లోని విశ్రాంత శాస్త్రవేత్త తన్వీర్ ఇంట్లోకి వరద నీరు వచ్చి చేరింది. వరద తాకిడితో ఇళ్లు మునిగిపోవడంతో తనతో పాటు తన 81 తల్లిని..పని మనిషి కుటుంబాన్ని తీసుకుని ఆయన టెర్రస్‌పైకి వెళ్లారు. తాము ప్రమాదంలో చిక్కుకున్నామని, రక్షించాలని ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులకు దాదాపు 50 సార్లు ఫోన్ చేశారట. వెంటనే రెస్క్యూ టీమ్స్ పంపుతామని చెప్పిన వారు, గంటలు గడుస్తున్నా ఎవరూ రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 15 గంటలపాటు టెర్రస్‌పై ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడిపామని వాపోయారు. తెలిసినవారి ద్వారా కలెక్టర్‌ను కాంటాక్ట్ అయ్యామని, అప్పుడుగాని మమల్ని కాపాడానికి సహాయక బృందాలు రాలేదని చెప్పారు.  ( ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు ! )