ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే పదేళ్లు జైలు..పబ్బు నిర్వాహకులకూ తప్పని శిక్షలు.!

|

Nov 14, 2020 | 1:01 PM

ఇకపై డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనిఖీలు మరింత కఠినతరం చేస్తామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ వెల్లడించారు‌. ఏసీపీ స్థాయి అధికారులతో డ్రంకన్‌ అండ్‌ డ్రైవింగ్‌..

ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే పదేళ్లు జైలు..పబ్బు నిర్వాహకులకూ తప్పని శిక్షలు.!
Follow us on

Drunk And Drive Cases: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సీపీ సజ్జనార్‌ సీరియస్‌గా దృష్టి సారించారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రెండు ప్రమాదాలు మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం వల్లే జరిగాయని నిర్థారణకు వచ్చారు.

ఇకపై డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనిఖీలు మరింత కఠినతరం చేస్తామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ వెల్లడించారు‌. ఏసీపీ స్థాయి అధికారులతో డ్రంకన్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనిఖీల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా పబ్‌లో మద్యం సేవించి డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే 10 ఏళ్లు జైలు శిక్ష పడేలా కేసులు పెడతామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

అంతేకాకుండా డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పబ్‌ నిర్వాహకులను కూడా చేరుస్తామన్నారు‌. పబ్‌లో మద్యం సేవించి బయటకు వచ్చేవారిని ఇంటికి చేర్చే బాధ్యత పబ్‌ నిర్వాహకులదేనని అన్నారు. వారికి ప్రత్యామ్నాయ డ్రైవర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, మద్యం సేవించిన వారికి వెహికల్‌ ఇచ్చినా కూడా నేరమే అని, వాహనం యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Also Read:

డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..

సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..