మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

|

Sep 26, 2020 | 5:13 PM

మందుబాబులకు కిక్కిచ్చే వార్త. ఇకపై ఇంట్లో కూర్చుని ఆర్డర్ ఇస్తే చాలు.. మద్యం సరాసరి ఇంటికే చేరుతుందట. హైదరాబాద్‌కు చెందిన ఒక స్టార్టప్ సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా...

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!
Follow us on

Booozie launches social drinking platform: మందుబాబులకు కిక్కిచ్చే వార్త. ఇకపై ఇంట్లో కూర్చుని ఆర్డర్ ఇస్తే చాలు.. మద్యం సరాసరి ఇంటికే చేరుతుందట. హైదరాబాద్‌కు చెందిన ఒక స్టార్టప్ సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా ఆన్‌లైన్ సోషల్ డ్రింకింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇన్నోవెంట్ టెక్నాలజీస్ స్టార్టప్ సంస్థ Boozie తాజాగా సోషల్ డ్రింకింగ్ ప్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేసింది. (సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..)

ఈ వెబ్ అండ్ యాప్ బేస్‌డ్‌ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో దేశంలోని ప్రతీ నగరంలో అందుబాటులో ఉండే పలు రకాల ప్రత్యేక బ్రాండ్‌లు వాటి ఎంఆర్పీల జాబితాతో పాటు బార్‌లు / క్లబ్‌లు.. వాటిలోని ఆఫర్‌లు, ఈవెంట్లకు సంబంధించిన వివరాలను వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు దీని ద్వారా ఆన్లైన్‌లో మద్యం డోర్ డెలివరీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సంస్థ హైదరాబాద్‌లో సేవలందించేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుందట. అవి వచ్చిన వెంటనే దీన్ని ప్రారంభిస్తామని చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ వివేకానంద్ బలిజెపల్లి స్పష్టం చేశారు. (ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..)

ఈ సంస్థ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో మద్యం ఆన్‌లైన్ డెలివరీని ప్రారంభించాలని యోచిస్తోంది. డెలివరీ చేసే వ్యక్తి దగ్గరలోని దుకాణం నుంచి మద్యం తీసుకుని వినియోగదారులకు ఉచిత డెలివరీని అందిస్తారని.. దీని కోసం ముందుగానే ఆయా వైన్ షాపుల యజమానులతో ఒప్పందం కుదుర్చుకుంటామని వివేకానంద్ వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో 10 రాష్ట్రాల్లో, ఏడాదిలోపు 20 రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. కాగా, రాబోయే 12 నెలల్లో 1000కి పైగా ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటు లాభాల్లో కొంత భాగాన్ని జాతీయ రక్షణ నిధి, సంబంధిత రాష్ట్ర సీఎం కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్‌కు కేటాయిస్తామని వివేకానంద్ బలిజెపల్లి తెలిపారు.  (కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!)