హిమాలయ రాష్ట్రాలలో కొండచరియల బీభత్సం

|

Aug 25, 2020 | 1:22 PM

హిమాలయ రాష్ట్రాలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. వర్షాల తాకిడికి కొండచరియలు విరిగిపడుతున్నాయి.. ఉత్తరాఖండ్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది..

హిమాలయ రాష్ట్రాలలో కొండచరియల బీభత్సం
Follow us on

హిమాలయ రాష్ట్రాలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. వర్షాల తాకిడికి కొండచరియలు విరిగిపడుతున్నాయి.. ఉత్తరాఖండ్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. రుషికేశ్‌, భద్రినాథ్‌ జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి.. ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. చమోలీ జిల్లా పోఖ్రీ గ్రామ పంచాయతీ కార్యాలయంపై కొండచరియలు జారిపడటంతో జూనియర్‌ ఇంజనీర్‌ సహా మొత్తం నలుగురు కన్నుమూశారు.. జమ్ము-కశ్మీర్‌ రియాసీ జిల్లాలో రెండు చోట్ల విరిగిపడిన కొండచరియలు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మరొకరి ప్రాణాలు తీశాయి