అచ్చెన్నాయుడుకి మరోసారి హైకోర్టులో చుక్కెదురు

| Edited By:

Jul 29, 2020 | 1:09 PM

ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది.

అచ్చెన్నాయుడుకి మరోసారి హైకోర్టులో చుక్కెదురు
Follow us on

MLA Atchannaidu: ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఆయనతో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఏ1 రమేష్ కుమార్, పితాని సత్యనారాయణ పీఏ మురళి, మరో నిందితుడు సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా న్యాయస్థానం కొట్టేసింది. కాగా మంత్రిగా పనిచేసిన సమయంలో ఈఎస్‌ఐలో అచ్చెన్నాయుడు అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఇందులో ఆధారాలను సేకరించిన ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడుని అదుపులోకి తీసుకొని విచారించారు. అనారోగ్యం దృష్ట్యా ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ గతంలోనూ అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో పిటిషన్లు పెట్టుకోగా.. అవి తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.

Read This Story Also: సుశాంత్‌ ఫ్యాన్స్ అనుకున్నది సాధించారు