ఫస్ట్‌ టైమ్ షర్ట్ లేకుండా మహేష్.. ఫొటో వైరల్

| Edited By:

May 19, 2020 | 10:12 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితమైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా సినిమాల షూటింగ్‌లు లేకపోవడంతో.. మహేష్ పూర్తిగా ఇంటికే అంకితమయ్యారు. కరోనా కారణంగా దొరికిన సమయాన్ని తన పిల్లలతో..

ఫస్ట్‌ టైమ్ షర్ట్ లేకుండా మహేష్.. ఫొటో వైరల్
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితమైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా సినిమాల షూటింగ్‌లు లేకపోవడంతో.. మహేష్ పూర్తిగా ఇంటికే అంకితమయ్యారు. కరోనా కారణంగా దొరికిన సమయాన్ని తన భార్య, పిల్లలతో సరదాగా గడిపేస్తున్నారు. అయితే షర్ట్ లేకుండా ఎప్పుడూ కనిపించని మహేష్.. ఒకేసారి షర్ట్ లేకుండా ఉన్న ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోని స్వయంగా నమ్రతనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ ఫొటోలో.. మహేష్ షర్ట్ లేకుండా తన కూతురు సితారతో కలిసి స్విమ్మింగ్ ఫూల్‌లో ఆటలాడుతూ కనిపించాడు. మహేష్‌ని ఫస్ట్ టైమ్ ఇలా చూస్తున్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకూ మహేష్ బాబు షర్ట్ లేకుండా కనిపించలేదు. సినిమాల్లో కూడా మహేష్ తన షర్ట్‌ను తొలగించలేదు. అలా షర్ట్ తీయాల్సి వస్తుందని.. మహేష్ సినిమాలు వదిలేస్తాడనే వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఏదేమైనా.. ఫస్ట్ టైమ్ మహేష్‌ని ఇలా చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఫొటోను ట్రోల్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి