త‌మిళ తంబీలు పండుగ చేసుకునే మల్టీస్టారర్ !

|

Aug 19, 2020 | 9:18 AM

త‌మిళ తంబీలు పండుగ చేసుకునే మల్టీస్టారర్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం అందుతోంది‌. సౌత్ సూప‌ర్ స్టార్‌ రజనీకాంత్‌, లోకనాయ‌కుడు కమల్‌హాసన్‌ కాంబినేషన్​లో ఓ చిత్రం త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

త‌మిళ తంబీలు పండుగ చేసుకునే మల్టీస్టారర్ !
Follow us on

త‌మిళ తంబీలు పండుగ చేసుకునే మల్టీస్టారర్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం అందుతోంది‌. సౌత్ సూప‌ర్ స్టార్‌ రజనీకాంత్‌, లోకనాయ‌కుడు కమల్‌హాసన్‌ కాంబినేషన్​లో ఓ చిత్రం త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జరుగుతున్నట్టు డైరెక్ట‌ర్ లోకేశ్​ కనకరాజ్‌ తెలిపారు.

కమల్‌హాసన్ ఓన్ బ్యాన‌ర్ రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది. యువ దర్శకుడు లోకేశ్​ కనకరాజ్ ఈ చిత్రం తెర‌కెక్కించ‌నున్నారు. ఇటీవల ‘ఖైదీ’తో ఈ ద‌ర్శకుడు సూప‌ర్‌హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. రజనీ – కమల్ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో లోకేష్‌ మాట్లాడుతూ.. “త్వరలోనే ప్రొడ‌క్ష‌న్ హౌస్ వివరాల్ని ప్రకటిస్తుంది. ఈ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడటం మరీ తొందరపాటు అవుతుంది. ప్రజంట్ చర్చలు జరుగుతున్నాయి” అన్నారు. దీన్నిబట్టి ఈ స్టార్​ హీరోలు కలిసి నటించే సినిమా దాదాపు క‌న్ఫామ్ అయిన‌ట్లే అనిపిస్తోంది. రజనీ – కమల్‌ తమిళంలో పది సినిమాల్లో కలిసి నటించారు.

 

Also Read :

వారికి త‌క్ష‌ణ సాయంగా రూ.2 వేలు : ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !