తెలంగాణ వెద‌ర్ రిపోర్ట్ : శ‌ని, ఆదివారాల్లో వ‌ర్షాలు !

|

Aug 01, 2020 | 7:12 AM

బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఈ నెల 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.

తెలంగాణ వెద‌ర్ రిపోర్ట్ : శ‌ని, ఆదివారాల్లో వ‌ర్షాలు !
Rain Alert
Follow us on

Rain alert for Telangana : బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఈ నెల 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. మరఠ్వాడా నుంచి తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింద‌ని… కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్ల‌డించారు. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల వలయం ఏర్పడింద‌ని.. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయ‌ని వివ‌రించారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.

కాగా రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం 8 గంటల వరకు అత్యధికంగా 24 గంటల వ్యవధిలో గుమ్మడిదల (సంగారెడ్డి జిల్లా)లో 16.5 సెంటిమీట‌ర్లు, కోటిపల్లి (వికారాబాద్‌)లో 12.1 సెం.మీ, లింగంపల్లి (హైదరాబాద్‌)లో 8.4 సెం.మీ, నర్సాపూర్‌ (మెదక్‌)లో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Read More : ప్రకాశం జిల్లా : శానిటైజర్​ తాగి మృతిచెందిన వారిలో నలుగురికి కరోనా