గ్రేటర్ పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు

|

Oct 14, 2020 | 12:59 PM

ఎడతెరిపిలేని వర్షాలతో  భాగ్యనగరం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో వరదనీరు పోటెత్తుతుంది.

గ్రేటర్ పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు
Follow us on

ఎడతెరిపిలేని వర్షాలతో  భాగ్యనగరం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో వరదనీరు పోటెత్తుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా జల దిగ్భంధంలోనే ఉన్నాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముంపుతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  జీఎచ్‌ఎంసీ పరిధిలో 3 రోజులు ప్రజలు బయటకు రావద్దని అధికారుల విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షం, వరదల ముప్పు నేపథ్యంలో ఈ రోజు, రేపు గ్రేటర్ పరిధిలోని అన్ని గవర్నమెంట్, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు అధికారులు. వర్షాలకు నానిపోవడంతో శిథిలావస్థలో ఉన్న బిల్డింగులు కూలిపోతున్నాయి. వర్షానికి తోడు గాలులు  కూడా తోడవడంతో నగరంలో చాలా చోట్ల  చెట్లు కూలాయి. జీహెచ్‌ఎంసీకి హెల్ప్‌లైన్‌కు  220 చెట్లు కూలిన ఫిర్యాదులు అందాయి. ఇంకా క్లియర్ చేయాల్సిన చెట్లు 70 ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీగా నీరు నిలిచి ఉండడంతో చెట్లు తీయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Also Read :

Breaking : కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య !

హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్‌: 3 రోజులు బయటకు రావొద్దు