హథీరాంజీ మఠం సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యయత్నం.. మఠం అధికారుల వేధింపులే కారణమంటున్న ఉద్యోగులు..!

|

Jan 07, 2021 | 5:59 PM

హథీరాంజీ మఠంలో సెక్యూరిటీ గార్డు కత్తితో గొంతు కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు.

హథీరాంజీ మఠం సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యయత్నం.. మఠం అధికారుల వేధింపులే కారణమంటున్న ఉద్యోగులు..!
Follow us on

తిరుపతిలోని హథీరాంజీ మఠంలో సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్యయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. హథీరాంజీ మఠంలోనే కత్తితో గొంతు కోసుకుని బలవన్మరణానికియత్నించాడు.. రక్తసిక్తమై అతన్ని తోటి సిబ్బంది.. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. హథీరాంజీ మఠంలో బసవరాజు అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అదే మఠంలో పనిచేస్తున్న ముని వెంకటేష్ అనే ఉద్యోగి నగలను బసవరాజు పేరుతో తాకట్టుపెట్టాడు. ఇవాళ వాటిని విడిపించి బయటకు తీయడంతో.. ఆ నగలు మఠానికి చెందినవేనని.. బసవరాజును మఠం మహంతు బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బసవరాజు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అయితే, ఇటీవల కాలంలోనే హథీరాంజీ మఠం నుంచి మాయమైన డాలర్ ను కూడా ఉద్యోగులే తాకట్టు పెట్టారని అనుమానిస్తున్నారు మఠం మహంతు. ఇదే క్రమంలో బెదిరింపులకు పాల్పడ్డటంతో బసవరాజు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు మాయమైన డాలర్ పై మహంతు అర్జున్ దాస్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బసవరాజు ఆత్మహత్యాయత్నంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన చావుకు కారణం మహంతు అర్జున్ దాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఉన్న మిశ్రాలే కారణమంటూ సెక్యూరిటీ గార్డు బసవరాజు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్న ఈస్ట్ పోలీసులు మహంతు అర్జున్ దాస్ ను, మఠం సిబ్బందిని విచారిస్తున్నారు.

వరుస ఘటనలపై ఏపీ పోలీసులు అప్రమత్తం.. అన్ని ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టం.. సీసీ కెమెరాలతో నిఘా నేత్రం