Breaking : టర్కీలో భారీ భూకంపం, అల్లకల్లోలం !

|

Oct 30, 2020 | 7:35 PM

2020లో ఎన్నో విషాదాలు, ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు  టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై  7.0గా నమోదైనట్లు టర్కీ మీడియా వెల్లడించింది.

Breaking : టర్కీలో భారీ భూకంపం, అల్లకల్లోలం !
Follow us on

2020లో ఎన్నో విషాదాలు, ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు  టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై  7.0గా నమోదైనట్లు టర్కీ మీడియా వెల్లడించింది. భూకంపం వల్ల భారీ ఆస్థి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూకంపం వల్ల ఏజియన్ సముద్రంలో తీవ్ర అలజడులు చెలరేగాయి. సునామీ వాతావరణం కనిపించింది. తీరంలో నిలిపి ఉంచిన నౌకలు వెనక్కి వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. సముద్రంలో అల్లకల్లోలంగా మారింది. ఏజియన్ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రం నిక్షిప్తమైనట్లు టర్కీ అత్యవసర విపత్తు స్పందనా దళం తెలిపింది.  టర్కీ, గ్రీస్‌లోని చాలా ప్రాంతాలను భూకంపం కుదిపేసింది. ఇజ్మిర్ సిటీలో పదుల సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి. ఓ భారీ భవంతి కుప్పకూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి భూకంపం విధ్వంసానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను టర్కీ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

Also Read :

జగ్గయ్యపేటలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం

ఇంట్లో వాస్తు దోషం..బయట ప్రభుత్వం వేసిన రోడ్డు ధ్వంసం !