ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్.. ఓటెత్తని గ్రేటర్ ఓటరు..మొత్తం ఓటింగ్ శాతం ఎంతంటే..!

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. విశ్వనగరం కావడానికి ఉవ్విళ్లూరుతున్న హైదరాబాద్‌లో గ్రేటర్‌ ఎన్నికల్లో- ప్రజాస్వామ్యం డీలాపడింది. పెద్దసంఖ్యలో ముందునిలిచి ఓటేయాల్సిన..

ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్.. ఓటెత్తని గ్రేటర్ ఓటరు..మొత్తం ఓటింగ్ శాతం ఎంతంటే..!
Follow us

|

Updated on: Dec 01, 2020 | 10:07 PM

Greater Polling Ended : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. విశ్వనగరం కావడానికి ఉవ్విళ్లూరుతున్న హైదరాబాద్‌లో గ్రేటర్‌ ఎన్నికల్లో- ప్రజాస్వామ్యం డీలాపడింది. పెద్దసంఖ్యలో ముందునిలిచి ఓటేయాల్సిన యువతీయువకులు బాధ్యత మరిచారు. డివిజన్‌లో సమస్యపై ప్రశ్నించేవారు, నిగ్గదీసేవారు- పోలింగ్‌ రోజున గడప దాటలేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో పాటు ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు ఓటింగ్‌లో పెద్దగా పాల్గొనలేదు.

ఓటింగ్ హడావుడి మచ్చుకైనా కనిపించలేదు. చలికాలం కదా… గంట తర్వాత ఓటేసేందుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు భావించినప్పటికి.. ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించలేదు. 150 డివిజన్లలోని కేవలం ఒకటి రెండు చోట్ల మినహా… జంటనగరాల పరిధిలో ఓటు హక్కును చాలా మంది బాధ్యతగా భావించలేదని కనిపింది.

సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కరోనా బాధితులతో పాటు సాధారణ ఓటర్లకు కూడా అవకాశం కల్పించారు. గురువారం ఓల్డ్‌ మలక్‌పేట్‌లో రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 4న ఓట్లు లెక్కింపు జరగనుంది.

పోలింగ్ ముగిసిన తరువాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్‌ మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకుంది. మొత్తం 150 డివిజన్లలో కొన్ని స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ 50 శాతం దాటింది. కొన్ని చోట్ల కనీసం పోలింగ్‌ 15 శాతం కూడా చేరకపోవడం గమనార్హం.

గ్రేటర్‌ పరిధిలో 74 లక్షల 44 వేల మంది ఓటర్లుంటే… మధ్యాహ్నం 3 గంటలు దాటే సమయానికి ఇందులో సగానికిపైగా ఓటు వేయలేదు. మూసపేట, జూబ్లిహిల్స్‌ వంటి నగరంలో ఉన్న డివిజన్లతో పాటు గుడిమల్కాపూర్‌, పటాన్‌ చెరు వంటి శివారు ప్రాంత ప్రజలు మాత్రం ఓటేశారు. నగరంలోని చాలా చోట్ల వృద్ధులు, గర్భిణిలు, దివ్యాంగులు సైతం ఓటు వేసేందుకు కదిలివచ్చారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఈసారే అత్యంత తక్కువ శాతం ఓటింగ్ శాతం నమోదవడం విశేషంగా చెప్పుకోవాలి. 149 డివిజన్లలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ అత్యంత పలుచగా, ప్రశాంతంగా ముగిసింది. ఆర్సీపురం, పటాన్‌చెరు, అంబర్‌పేటలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. మలక్‌పేట్, కార్వాన్‌లో అత్యల్ప శాతం ఓటింగ్ నమోదైంది.

Latest Articles
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..