గుంటూరు జిల్లాలో విషాదం, పిల్లలు పుట్టడం లేదని ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఆత్మహత్య

|

Dec 07, 2020 | 5:34 PM

పిల్లలు పుట్టడం లేదని ఆవేదన చెందిన ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఉరేసుకోని తనువు చాలించాడు. ఈ మేరకు అరండల్‌పేట్ ‌పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

గుంటూరు జిల్లాలో విషాదం, పిల్లలు పుట్టడం లేదని ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఆత్మహత్య
Follow us on

గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని ఆవేదన చెందిన ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఉరేసుకుని తనువు చాలించాడు. ఈ మేరకు అరండల్‌పేట్ ‌పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే…వెంగళరావు నగర్‌లో నివశించే వినుకొండ ఆనందబాబు (27) గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా వర్క్ చేస్తున్నాడు. అతడికి రాజేశ్వరి అనే యువతితో ఐదేళ్ల క్రితం పెళ్లైంది. ఆమె ప్రజంట్ ముట్లూరులో వాలంటీర్‌‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే పెళ్లై ఐదేళ్లు గడుస్తోన్నా వారికి సంతానం కలగలేదు. ఈ క్రమంలో పలు ఆస్పత్రులకు తిరిగినప్పటికీ ఫలితం దక్కలేదు.

ఆ బాధలో ఆనందబాబు మద్యానికి బానిసయ్యాడు. తన బాధను స్నేహితుల వద్ద చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో  ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో  చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనందబాబు అమ్మ సునీత  సాయంత్రం చర్చి నుంచి తిరిగి వచ్చసరికి అతడు విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని…మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

Also Read :

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కలకలం, ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో గతంలో సోకినవారికి కూడా

విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన, 2021 జనవరి 31లోపు ఆ ప్రయాణికులందరికీ రీఫండ్

అయ్యప్ప స్వామి దర్శనం కావాలంటే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాల్సిందే, ఒకవేళ లేకపోతే